జె.వి.నరసింగరావు
(జోగినపల్లి వెంకట నరసింగరావు నుండి దారిమార్పు చెందింది)
జె.వి.నరసింగరావు భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ 1956 పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపు నుంచి సంతకం చేసిన వారిలో ఒకరు. ఇతను 1972లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇతను 1967, 1972లలో జరిగిన రెండు వరుస ఎన్నికల్లో లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఎగా గెలిచారు, తను రెండవసారి గెలిచినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
జోగినపల్లి వెంకట నరసింహారావు | |
---|---|
జననం | జోగినపల్లి వెంకట నరసింహారావు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయనాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి |
పిల్లలు | నృపేంద్రరావు |
వ్యక్తిగత జీవితం
మార్చుజె.వి.నరసింగరావు పూర్తిపేరు జోగినపల్లి వెంకట నరసింగరావు. ఇతని పెద్ద కుమారుడు నృపేందర్‌రావు పెన్నార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, యజమాని.[1][2]
ఇవి కూడా చూడండి
మార్చు- పెద్దమనుషుల ఒప్పందం - 1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి చేసుకున్న ఒప్పందం.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-28. Retrieved 2014-11-10.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-26. Retrieved 2014-11-10.