జోజిలా టన్నెల్‌ సోనామార్గ్‌, కార్గిల్‌ మధ్యన ఉన్న జోజిలా ఘాట్స్‌లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తులో 14.2 కిలోమీటర్ల మేర శ్రీనగర్‌ - లేహ్‌లను కలుపుతూ 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో రెండు వరుసల్లో నిర్మిస్తున్న టన్నెల్‌. ఇది భారతదేశంలోనే పొడవైన రోడ్‌ టన్నెల్‌, ఆసియాలో పొడవైన బై-డైరెక్షనల్‌ టన్నెల్‌.[1] శ్రీనగర్ - లద్దాఖ్‌ మధ్య ప్రస్తుతం ప్రయాణానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్‌ పూర్తయితే కేవలం 15 నిమిషాల్లోనే ఈ దూరాన్ని చేరుకుంటారు.

జోజిలా టన్నెల్‌
అవలోకనం
ప్రదేశంజోజిలా, లద్దాఖ్‌,
భారతదేశం India
అక్షాంశ,రేఖాంశాలు34°16′44″N 75°28′19″E / 34.27889°N 75.47194°E / 34.27889; 75.47194
స్థితినిర్మాణం జరుగుతుంది
మార్గముC2 జాతీయ రహదారి 1
నిర్వహణ వివరాలు
ప్రారంభ తేదీ15 అక్టోబర్ 2020
నిర్వాహకుడునేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
Trafficమోటార్ వెహికల్స్
సాంకేతిక వివరాలు
No. of lanes2
Road to Zoji La Pass from Srinagar

నిర్మాణం మార్చు

జోజిలా టన్నెల్ నిర్మించాలని 2013లో యూపీఏ హయాంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు. జోజిలా టనెల్‌ నిర్మాణాన్ని మేఘ ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ 2020 ఆగస్టులో దక్కించుకుంది.[2][3][4] ఈ టన్నెల్ నిర్మాణ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫస్ట్‌ బ్లాస్ట్‌తో 2020 అక్టోబరు 15లో ప్రారంభించాడు. జోజిలా టన్నెల్‌ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, ఓవర్‌ హైట్‌ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌, ఫైర్‌ అలారం, స్పీడ్‌ లిమిట్‌ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.

మూలాలు మార్చు

  1. Andrajyothy (30 September 2021). "పొడవైన రోడ్‌ టన్నెల్‌!". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  2. "Megha Engineering lowest bidder for Zojila tunnel, quotes Rs 4,509 cr for project" – via The Economic Times.
  3. "Megha Engineering company to build Zojila Pass tunnel project". Deccan Herald. 21 August 2020.
  4. Saluja, Nishtha. "Zojila Tunnel project awarded to Hyderabad-based Megha Engineering" – via The Economic Times.