జోరంతంగ(Zoramthanga)(జననం 1944 జులై 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇతను మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు.[1]

జోరంతంగ
జోరంతంగ


మిజోరాం రాష్ట్ర 5వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 డిసెంబర్ 15
గవర్నరు పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై
పదవీ కాలం
1998 డిసెంబర్ 3 – 2008 డిసెంబర్ 11
గవర్నరు ఎం.ఎం.లఖేరా
ముందు లాల్ తాంహ్వల
తరువాత లాల్ తాంహ్వల

వ్యక్తిగత వివరాలు

జననం (1944-07-13) 1944 జూలై 13 (వయసు 79)
రాజకీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామి రోనెఇహసంగి
సంతానం 2
నివాసం ఐజాల్, మిజోరాం, భారత్

బాల్యం మార్చు

జోరంతంగ 1944 జులై 13న దర్ఫవుంగా, వాంహ్నునిచ్చింగి దంపతులకు సంతాంగ్ గ్రామంలో జన్మించాడు. ఇతనికి నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు.[2]

విద్య మార్చు

1950లో జోరంతంగ సంతాంగ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తన చదువుని ప్రారంభించాడు. ఆ తరువాత గాంధీ మెమోరియల్ హై స్కూల్ లో చదువు కొనసాగించాడు.[3] ఆ సమయంలో మిజోరాం రాష్ట్రంలో సరైన విద్యా సదుపాయాలు లేకపోవడం వల్ల, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేక తంగ చదువు సాగించడం కష్టంగానే ఉండిందని ఆయన చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఆ తరువాత తంగ మణిపూర్ లోని ఇంఫాల్ వెళ్లి అక్కడ ధనమంజురి (D.M.) కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో ప్రీ-యూనివర్శిటీ కాలేజీ (పియుసి, హయ్యర్ సెకండరీకి ​​సమానం) లో చేరాడు. 1962 లో పియుసి పూర్తి చేసి, 1966లో బి.ఎ. ఆంగ్లంలో పట్టభద్రుడయ్యాడు.

కెరీర్ మార్చు

జోరామ్‌తంగా 1965 లో తన కళాశాల చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.[4] 1966 లో ఎంఎన్ఎఫ్ తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, అతను గెరిల్లా ఉద్యమంలో చేరి బంగ్లాదేశ్(అప్పటి తూర్పు పాకిస్తాన్) సరిహద్దు ప్రాంతంలోని ఒక అండర్ గ్రౌండ్ స్థావరానికి వెళ్ళాడు. 1969 లో, MNF కార్యకర్తలందరు తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) కి వెళ్లారు. ఈ దళానికి లాల్డెంగా అధ్యక్షుడుగా ఉండేవాడు, తరువాత ఇతను మిజోరాం ముఖ్యమంత్రి పదవికూడా చేపట్టాడు.[5]

మూలాలు మార్చు

  1. "Early Christmas For Mizoram's MNF, Zoramthanga To Be New Chief Minister". NDTV.com. Retrieved 2021-06-22.
  2. "Biodata of Shri Zoramthanga". mizoram.nic.in. Retrieved 2021-06-22.
  3. Dec 12, Prabin Kalita / TNN / Updated:; 2018; Ist, 08:46. "Zoramthanga: Mizoram results: This former guerrilla scripted Congress defeat | Guwahati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-22. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. Sharma, Shantanu Nandan. "Zoramthanga: From being an insurgent to becoming Mizoram CM". The Economic Times. Retrieved 2021-06-22.
  5. "MNF chief Zoramthanga: The Sun Tzu of Mizoram". The New Indian Express. Retrieved 2021-06-22.
"https://te.wikipedia.org/w/index.php?title=జోరంతంగ&oldid=4086432" నుండి వెలికితీశారు