జోషిమఠ్ అనేది భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాకు చెందిన ఒక నగరం. దీనిని జ్యోతిర్మఠ్ అని కూడా వ్యవహరిస్తారు. దీనికి కారణం ఆది శంకరాచార్యులు స్థాపించిన బదరీనాధ్ ఆశ్రమం నాలుగు మఠాలలో ఒకటైన జ్యోతిర్మఠము ఇక్కడ ఉండటమే.

జోషిమఠ్
జ్యోతిర్మఠం
పట్టణం
నర్సింహ దేవాలయం నుండి జ్యోతిర్మఠం దృశ్యం
నర్సింహ దేవాలయం నుండి జ్యోతిర్మఠం దృశ్యం
జోషిమఠ్ is located in Uttarakhand
జోషిమఠ్
జోషిమఠ్
జోషిమఠ్ is located in India
జోషిమఠ్
జోషిమఠ్
Coordinates: 30°34′N 79°34′E / 30.57°N 79.57°E / 30.57; 79.57
Countryభారతదేశం
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png ఉత్తరాఖండ్
Districtచమోలి జిల్లా
Tehsilజ్యోతిర్మఠం
జనాభా
 (2011)
 • Total16,709
Languages
 • Officialగర్వాలీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
246443[1]
Vehicle registrationUK-11
Websitehttp://chamoli.nic.in

6150 అడుగుల (1875 మీ) ఎత్తులో ఉన్న జోషిమఠ్ బద్రీనాథ్ దేవస్థానం చేరుకోవటానికి, అనేక హిమాలయ పర్వతారోహణ యాత్రా కేంద్రాలకు ప్రవేశ ద్వారం అని చెప్పాలి.

2021 ఉత్తరాఖండ్ వరదలు

మార్చు

2021లో సంభవించిన ఉత్తరాఖండ్ వరదలు, దాని అనంతర పరిణామాల వల్ల తీవ్రంగా 2021 ఫిబ్రవరి 7 నుండి జోషిమఠ్ ప్రభావితమైంది. ఈ పట్టణం దాని భౌగోళిక స్థానం రన్నింగ్ రిడ్జ్‌లో ఉన్నందున మునిగిపోతున్నట్లు నిర్ధారించబడింది. పట్టణం చుట్టూ ఉన్న నిర్మాణాలు పగుళ్లు ఏర్పడి పట్టణ ప్రజలను ఖాళీ చేయవలసి వచ్చింది.[2]

2023 కుంగిపోతున్న జోషిమఠ్

మార్చు

జోషిమఠ్ నగరంలో ప్రమాదకర రీతిలో భూమి కుంగిపోతుండడం, ఇళ్లకు బీటలు వారుతుండడం పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమైయ్యాయి. జోషిమఠ్‌ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా జనవరి 2023లో ప్రకటించింది. నగరంలో కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని నిర్ధారించింది. 19వేల జనాభా గల ఈ పట్టణంలో 4,500 నివాసాలు ఉండగా ఇప్పటి వరకు 610 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. కాగా అత్యవసరంగా 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.[3]

ప్రమాదకరంగా మారిన ఇళ్లకు ఇప్పటికే రెడ్‌మార్క్‌ వేసిన అధికారులు వాటిని కూల్చివేస్తామని ప్రకటించారు. ఇతర ఆవాస ప్రాంతాలు ఏమాత్రం సురక్షితమో నిర్దారించుకోవడానికని సర్వే నిర్వహించడానికి హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో పాటు డెహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తదితర కేంద్ర సంస్థలకు బాధ్యతలను అప్పగించారు.

ఇవీ చూడండి

మార్చు
  • జ్యోతిర్మఠం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ లో ఉంది.
  • పూరీ మఠం, పూర్వామ్నాయ మఠము అని, గోవర్ధన మఠమని కూడా పిలుస్తారు, ఇది పూరీ పట్టణంలో ఉంది.
  • ద్వారకా మఠం, గుజరాత్ లో ద్వారకా క్షేత్రము వద్ద ఉంది.
  • శృంగేరి మఠం, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది.

మూలాలు

మార్చు
  1. "Joshimath Pin code". pin-code.net. Archived from the original on 9 జూలై 2021. Retrieved 8 July 2021.
  2. Tripathi, Sibu (6 January 2023). "Why is Joshimath sinking? Alarm bells in hill town ringing since 1976". India Today. Retrieved 7 January 2023.
  3. "కుంగుతున్న పట్టణంగా జోషిమఠ్‌ | Joshimath as a sagging town". web.archive.org. 2023-01-09. Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జోషిమఠ్&oldid=4027207" నుండి వెలికితీశారు