జ్ఞానశ్రీమిత్ర సా.శ. 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ తత్వవేత్త, తార్కికుడు. దిజ్ఞాగ-ధర్మకీర్తి లచే నెలకొల్పబడిన జ్ఞానమీమాంస (ప్రమాణం) సంప్రదాయానికి చెందిన తర్కవేత్త. ఇతను విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయానికి ద్వారపండితుడు, ఆచార్యుడు. రత్నకీర్తికి గురువు. సా.శ. (975-1025) మధ్య కాలంలో జీవించిన జ్ఞానశ్రీమిత్ర తన కాలంలో బౌద్ధ వర్గాలనుండే కాక హిందూ, జైన మత వర్గాల నుండి కూడా ప్రముఖ తాత్వికుడుగా గుర్తింపు పొందాడు.[1]

తాత్విక చింతన

మార్చు
 
సంచిలో బౌద్ధ స్తూపం .

జ్ఞానశ్రీమిత్ర జ్ఞానమీమాంస (epistemology) సాధనాల (ప్రమాణం) పై ప్రత్యేక కృషి చేసాడు. అందులోను దిజ్ఞాగునిచే వివరించబడిన అపోహ (exclusion) సిద్ధాంతం గురించి, అది తత్వశాస్త్రానికి ఏ విధంగా సంబందిస్తుందన్న విషయాలపై దృష్టి సారించాడు. తన 'అపోహప్రకరణ' ("Monograph on Exclusion") గ్రంథంలో అపోహ సిద్ధాంతానికి జ్ఞానమీమాంసకు మధ్య గల సంబందాన్ని విశిదీకరించడంతో పాటు బౌద్ధ న్యాయంపై హిందూ న్యాయ విమర్శకుల దాడిని తిప్పికొడుతూ తన సిద్ధాంతాన్ని సమర్ధించుకొన్నాడు.[2]

అదేవిధంగా జ్ఞానశ్రీమిత్ర యోగాచార సిద్ధాంతాన్ని సమర్ధించాడు. అతని దృష్టిలో ఈ సర్వ జగత్తు విజ్ఞానం (consciousness) తోనే నిండి ఉంది.[3] విజ్ఞానం లేదా చిత్తం ఒక్కటే సత్యం.

వ్యాప్తికారిక అనే గ్రంథంలో పొగ, అగ్ని వంటి విభిన్నమైన రెండు ఆస్తిత్వాల మధ్య గల తార్కిక సంబంధాలను ఇతను విశిదీకరించాడు. ఈ అంశంలో జ్ఞానశ్రీమిత్ర వైఖిరిని రచయిత హోస్ట్ లాసిక్ (Horst Lasic) వివరిస్తూ “జ్ఞానశ్రీమిత్రకు సంబంధించినంత వరకు, విభిన్న ఆస్తిత్వాల మధ్య గల అనుమాన-నిశ్చయ సంబందం 'కార్యాకారణ సంబందం' (effect-cause relation) అయివుండాలి, అటువంటి సంబంధాలను కేవలం ఒక నిర్దిష్ట క్రమలో వచ్చే ప్రత్యక్షం (perception), అనుపలబ్ది (Non apprehension) ల ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది." అని పేర్కొంటాడు."[4]

బౌద్ధంలోని యోగాచార సంప్రదాయంలోని 'నిరాకార' శాఖకు చెందిన 'రత్నాకర శాంతి' ఇతని ప్రత్యర్థి. ఈ 'నిరాకార' శాఖను ఖండిస్తూ, జ్ఞానశ్రీమిత్ర యోగాచార సంప్రదాయంలోని 'సాకార' శాఖకు ప్రధాన సమర్ధకుడిగా నిలిచాడు.[5] అతను దేవునికి వ్యతిరేకంగా 'ఈశ్వరదూషణ' అనే గ్రంథాన్ని సైతం రచించాడు.

రచనలు

మార్చు
  • అద్వైతబిందు
  • అభిసమయహృదయ
  • అనేకచింతామణి
  • అనుపలాబ్దిరహస్య
  • అపోహప్రకరణ : తర్క సంబందమైన ముఖ్య గ్రంథం.
  • భేదాభేదపరీక్ష
  • సాకారసిద్ధిశాస్త్ర
  • సర్వశబ్దభావకారిక
  • ఈశ్వరదూషణ : ఇది భగవంతుని ఉనికిని నిరాకరిస్తుంది
  • కార్యాకరణభావసిద్ధి
  • క్షణభంగద్యాయ
  • (అధ్యార్ధ) ప్రజ్ఞాపారామిత నాయ శతపంచశతిక
  • సాకారసంగ్రహసూత్ర
  • సర్వజ్ఞసిద్ధి
  • తర్కభాష
  • వ్యాప్తికారిక
  • వ్రత్తమాలస్తుతి
  • యోగినీమాయప్రకరణ

మూలాలు

మార్చు
  1. McCrea; Patil, 2010, p. 2.
  2. McCrea; Patil, 2010, p. 20.
  3. McCrea; Patil, 2010, p. 21.
  4. Horst Lasic, Review of: Parimal G. Patil; Jñānaśrīmitra's Vyāpticarcā: Sanskrittext, Übersetzung, Analyse
  5. McCrea; Patil, 2010, p. 3.