జ్యోతిర్మయి మళ్ళ తొలి తెలుగు మహిళా గజల్ గాయకురాలు

జీవిత విశేషాలుసవరించు

జ్యోతిర్మయి మళ్ళ 1965లో విశాఖపట్నంలో జగన్నాథం, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించారు. బీఎస్సీ గణితం, ఎంఏ (హిందీ) ల్లో ఉత్తీర్ణులయ్యారు. గృహిణిగానే జీవితం గడుపుతున్నా, చెన్నైలో ఆకాశవాణి లలిత గీతాలకు బీ గ్రేడ్ కళాకారిణిగా పనిచేసారు.[1] మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎం.ఎస్‌. విశ్వనాథన్‌, వైద్యనాథన్‌ వంటి సంగీత విద్వాంసుల సారథ్యంలో తమిళ, తెలుగు లలిత గీతాలు ఆలపించారు. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో 2012లో మొదటిసారి గజల్‌ కచేరీ చేశారు. అమెరికాలోని జోహాన్స్ బర్గ్ నగరంలో ఇండికేర్స్ సంస్థ ఆధ్వర్యంలో కూడా గజల్‌ నేపథ్యంగా కచేరీ చేసారు. 2014లో మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారు జ్యోతిర్మయికి ఉగాది పురస్కారం అందించి సత్కరించారు. 2015లో కళాభారతి ఆడిటోరియం వేదికగా 'జ్యోతిర్మయి తెలుగు గజల్‌ అకాడమి' ఏర్పాటు చేశారు.[2]

మూలాలుసవరించు