జ్వరం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం (ఆంగ్లం: Fever) అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ (జ్వరమాపకం) ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీస్ ఫారిన్ హీట్ దాటితే మన శరీరంలో ఇన్‌ఫెక్షన్‌తో అంతర్యుద్ధం కొనసాగుతున్నదన్నమాట.
ICD-10 | R50 |
---|---|
ICD-9 | 780.6 |
DiseasesDB | 18924 |
eMedicine | med/785 |
MeSH | D005334 |
జ్వరం రావడానికి కారణాలు సవరించు
జబ్బు చేస్తే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే వ్యాధితో పోరాడటానికి శరీరంలో హెచ్చు ఉష్ణోగ్రత మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు శరీరంలో విడుదలయ్యే హార్మోనులు, ఎంజైములు లాంటి రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధితో పోరాటానికి పనికి వస్తాయి. అలాగే రక్త కణాలు అధికంగా విడుదలవుతాయి. వ్యాధి క్రిములను నాశనం చేయడానికి ఇవి అవసరం. రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఊపిరి వేగం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు (టాక్సీన్లు) తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. కానీ శరీరం ఎక్కువసేపు వేడిగా ఉంటే మనకు బలాన్ని ఇచ్చే మాంస కృతులు (ప్రొటీన్లు) నాశనం అవుతాయి. అందువల్ల మనిషి నీరసిస్తాడు. జ్వరానికి విశ్రాంతి అవసరం.[1]
- జలుబూ, రొంప, పడిశెం లేదా ఫ్లూ (అల్లము రసము, తెనె, పిప్పులు రసము)
- చెవిపోటు
- బ్రాంఖైటిస్
- నోటిపూత
- మూత్రకోశానికీ, మూత్రనాళాల వ్యాధులు.
- మానసిక ఒత్తిడి, ఆవేదన, శోకం వంటివి
- నూలుదుస్తులు ధరించేవాళ్లు, పండక్కి కొత్తపాలిస్టర్ బట్టలు కట్టుకున్నా
- రుతుక్రమం సమయంలో, వ్యాయామాలు అతిగా చేసినా, కొన్ని మందులు మోతాదుకు మించి వాడినా
రకాలు సవరించు
- చలిజ్వరం (Fever with chills) ఉదా : మలేరియా
- సన్నిపాత జ్వరం (Typhoid Fever)
- మలేరియా జ్వరం (Malaria Fever)
- బాలెంత జ్వరం (Puerperal Fever)
- డెంగ్యూ జ్వరం (Dengue Fever)
- చికెన్ గున్యా జ్వరం (Chickengunya Fever)
చికిత్స సవరించు
జ్వరం 101 డిగ్రీల ఫారిన్ హీట్ కన్నా తక్కువగా వుంటే, ప్రత్యేకమైన వైద్యం అవసరం లేదు. పుష్కలంగా పానీయాలు సేవిస్తే చాలు. జ్వరాన్ని అదుపు చెయ్యడానికి 'అస్పిరిన్' ఎసిటామినో ఫెన్, ఐబూప్రొఫేన్ వంటివి తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో స్నానం చేసినా శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. జ్వరం 103 డిగ్రీల ఫారిన్ హీట్ దాటి, 2 గంటల కంటే ఎక్కువసేపు ఉన్నా, వచ్చి 2 రోజులు దాటినా, టెంపరేచర్ 105 డిగ్రీస్ ఫారిన్‌హీట్ దాటినా, వైద్యుడిని సంప్రదించాలి.
సాధారణంగా జ్వరానికి చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జలుబు లేదా 'సర్ది' తో జ్వరం వస్తే పాలల్లో మిరియాలు మరిగించి తాగి విశ్రాంతి తీసుకొమ్మని చిట్కా ఇస్తారు.
మూలాలు సవరించు
- ↑ మహీధర, నళినీ మోహన్ (1987). చొప్పదంటు ప్రశ్నలు. హైదరాబాద్: విశాలాంధ్ర్. p. 66. ISBN 8170980712.