టామ్ సాయర్ (2011 సినిమా)
హెర్మైన్ హంట్‌బర్త్ దర్శకత్వంలో 2011లో విడుదలైన జర్మన్ బాలల కుటుంబ నేపథ్య సాహస చలనచిత్రం.
(టామ్ సాయర్ (2011 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
టామ్ సాయర్ 2011, నవంబరు 17న విడుదలైన జర్మన్ బాలల కుటుంబ నేపథ్య సాహస చలనచిత్రం. హెర్మైన్ హంట్‌బర్త్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్ తదితరులు నటించారు.[1]
టామ్ సాయర్ | |
---|---|
దర్శకత్వం | హెర్మైన్ హంట్‌బర్త్ |
స్క్రీన్ ప్లే | సాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్ |
నిర్మాత | బోరిస్ స్చాన్ఫెల్డర్ |
తారాగణం | లూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్ |
ఛాయాగ్రహణం | ది చౌ ఎన్గో |
కూర్పు | ఎవా ష్నారే |
సంగీతం | మోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్ |
విడుదల తేదీs | 30 సెప్టెంబరు 2011(హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్) 17 నవంబరు 2011 (జర్మనీ) |
సినిమా నిడివి | 109 నిముషాలు |
దేశాలు | జర్మనీ, రొమేనియా |
భాష | జర్మన్ |
బడ్జెట్ | $8,500,000 (అంచనా) |
బాక్సాఫీసు | $1,047,091 |
కథానేపథ్యం
మార్చుటామ్ సాయర్, అతని బృందం మిస్సిసిపి నదిలో చేసే సాహసాలతోపాటు ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వారు సముద్ర దొంగలుగా నటించే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది.[2]
నటవర్గం
మార్చు- లూయిస్ హాఫ్మన్ (టామ్ సాయర్)
- లియోన్ సీడెల్ (హకిల్బెర్రీ ఫిన్)
- హైక్ మకాట్ష్ (టాంటే పాలీ)
- బెన్నో ఫర్మాన్ (ఇండియనర్ జో)
- జోచిమ్ క్రోల్ (మఫ్ పాటర్)
- పీటర్ లోహ్మేయర్ (రిక్టర్ థాచర్)
- హిన్నెర్క్ స్కీన్మాన్ (షెరీఫ్)
- సిల్వెస్టర్ గ్రోత్ (డాక్ రాబిన్సన్)
- థామస్ ష్మాసర్ (రెవరెండ్ స్ప్రాగ్)
- ఆండ్రియాస్ వార్మ్‌బ్రన్ (సిడ్)
- మగలి గ్రీఫ్ (బెక్కి థాచర్)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: హెర్మైన్ హంట్‌బర్త్
- నిర్మాత: బోరిస్ స్చాన్ఫెల్డర్
- స్క్రీన్ ప్లే: సాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్
- ఆధారం: మార్క్ ట్వైన్ (నవల)
- సంగీతం: మోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్
- ఛాయాగ్రహణం: ది చౌ ఎన్గో
- కూర్పు: ఎవా ష్నారే
విడుదల
మార్చు2011, సెప్టెంబరు 30న తొలిసారిగా హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం 2011, నవంబరు 17న జర్మనీలో విడుదలయింది.[3]
మూలాలు
మార్చు- ↑ German Films, TOM SAWYER. "German Films: Film Info: TOM SAWYER". www.german-films.de. Archived from the original on 4 నవంబరు 2019. Retrieved 4 November 2019.
- ↑ ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 4 November 2019.
- ↑ https://www.themoviedb.org/movie/104711-tom-sawyer?language=en-US
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టామ్ సాయర్
- అధికారిక వెబ్సైటు
- Tom Sawyer Presseheft, PDF, auf gew-bw.de, abgerufen am 17. December 2013