టీ చరిత్ర అనేక సంస్కృతుల్లో వేలాది సంవత్సరాల పాటు విస్తరించింది. అది సుదీర్ఘమూ, సంక్లిష్టమూ ఐనది. టీ షాంగ్ రాజవంశ కాలంలో చైనాలోని యునాన్ ప్రాంతంలో ఔషధంగా ప్రారంభమైందని భావిస్తారు.[1] సా.శ. 3వ శతాబ్దిలో హువా టువో రాసిన వైద్య గ్రంథంలో టీ తాగడం గురించి తొలిసారిగా కనిపిస్తుంది.[2] 16వ శతాబ్దిలో లెబనాన్ ప్రాంతంలో టీ గురించి పోర్చుగీస్ మతాధికారులకు తెలిసింది.[3] 17వ శతాబ్దిలో టీ తాగే అలవాటు బ్రిటన్లో ప్రాచుర్యం చెందింది. టీ వాణిజ్యం మీద చైనీయుల ఏకచ్ఛత్రాధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి బ్రిటీష్ వారు భారతదేశంలో తేయాకు పండించడం ప్రారంభించారు.[4]

ఇండోనేషియాలో టీ తోటలు

మూలాలు

మార్చు
  1. Mary Lou Heiss; Robert J. Heiss (23 March 2011). The Story of Tea: A Cultural History and Drinking Guide. Random House. p. 31. ISBN 978-1-60774-172-5. By the time of the Shang dynasty (1766–1050 BC), tea was being consumed in Yunnan Province for its medicinal properties
  2. Martin, p. 29: "beginning in the third century CE, references to tea seem more credible, in particular those dating to the time of Hua T'o, a highly respected physician and surgeon"
  3. Bennett Alan Weinberg; Bonnie K. Bealer (2001). The World of Caffeine: The Science and Culture of the World's Most Popular Drug. Psychology Press. p. 63. ISBN 978-0-415-92722-2. The Portuguese traders and the Portuguese Jesuit priests, who like Jesuits of every nation busied themselves with the affairs of caffeine, wrote frequently and favorably to compatriots in Europe about tea.
  4. Colleen Taylor Sen (2004). Food Culture in India. Greenwood Publishing Group. p. 26. ISBN 978-0-313-32487-1.
"https://te.wikipedia.org/w/index.php?title=టీ_చరిత్ర&oldid=3501183" నుండి వెలికితీశారు