Tenofovir disoproxil fumarate, టెనొఫవిర్ ( (2R) -1- (6-amino-9H-purin-9-yl) propan-2-yl]oxy}methyl) phosphonic acid, TDF, brand name Viread®) అనేది HIV-1, hepatitis B చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి TDF పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV-1 చికిత్స కోసం 26-Oct-2001 [1] రోజున అమోదించబడింది. ఈ మందును Gilead Sciences అనే సంస్థచే కనిపెట్టబడింది.

దస్త్రం:620px-Tenofovir.svg.png

మోతాదు ( Dosage )

మార్చు

ఎయిడ్స్ మందుల Tenofovir టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరకడుపున కాని తిన్న తర్వాతగాని వేసుకోవచ్చు. ఈమందును ఒక్కదానినే వేసుకోకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపోతే గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. HIV తో ఉన్న పెద్దలకు డొస్ 300 mg రోజుకు ఒకసారి ప్రతిరోజు వేసుకొవాలి.

దుష్ప్రబావాలు (Side Effects )

మార్చు

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. ఎముకల సమస్యలు: క్లినికల్ ట్రయల్స్ తెలిందెంటంటె ఈ మందు నడుము, వెన్నముక ఎముకలలోని bone in mineral density (BMD) ను తగ్గించటం జరిగింది. మీకు నడుమునొప్పి కాని వెన్నముక్క నొప్పి కాని వస్తె వెంబడె మీ డాక్టరుకు తెలపండి. Calcium, Vitamin D తీసుకొంటె ఎంతవరకు ఈ దుష్ప్రబావాన్ని తగ్గించవచ్చొ తెలియదుకాని ఈ మందు తీసుకొనె వాళ్లు ఈ మాత్రలను వేసుకొవటం మంచిది.
  2. కిడ్ని సమస్యలు: ఈ మందు వేసుకునె వాళ్లలో కిడ్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకోసం మీ డాక్టరు "creatinine clearance" చెస్తు మీ కిడ్నిలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ టెస్టును బట్టి మీకు టెనొపవిర్ ను కొనసాగించాలో లేదొ మీ డాక్టరు నిర్ణయిస్తాడు.
  3. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  4. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
  5. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఎదలో కాలటం (Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.

ఈ మందును ఎవరు వేసుకోకూడదంటే?

మార్చు

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైనా లివర్, కిడ్ని సమస్యలు వుంటే, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటే, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటే Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటే, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటే. వీటిలో ఎదైనా సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకోకపోవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.

గర్భవతి మహిళలు వేసుకోవచ్చా?

మార్చు

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దీనిని జంతువులపై ప్రయోగించినపుడు పరీక్షలలో తేలినది ఏమిటంటే గర్భంలోని పిండానికి హాని చేకురుస్తుంది. కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్భిణి మహిళలు ఈ మందును వేసుకునే ముందు డాక్టరుతో చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపోవడం మంచిది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-08.
  2. http://www.aidsmeds.com/archive/Viread_1587.shtml