కేశాలు, కండలు, ఎముకలు వంటి అనేక రకాల కణజాలాలా ద్వారా ఏర్పడే గ్రంథిని టెరటోమా అని పిలుస్తారు. ఇవి సహజంగా అండాశయాలు, వృషణాలు, టెయిల్ బోన్ (Tail bone) లలో, ఇతర స్థలాలలో ఏర్పడతాయి. గ్రంథి చిన్నది అయితే వాటి లక్షణాలు స్పష్టంగా తెలియవు. ఓవెరియన్ టోర్షన్ (Ovarian torsion), టెస్టిక్యూలర్ టోర్షన్ (Testicular torsion) దీని సమస్యలలో ఉండవొచ్చు.  

టెరటోమా (Teratoma)
Mature cystic teratoma of ovary.jpg
A small (4 cm) dermoid cyst of an ovary, discovered during Cesarean section
ప్రత్యేకతగైనకాలజీ, ఆంకాలజీ
లక్షణాలుMinimal, painless lump
ఉపద్రవాలుOvarian torsion, testicular torsion, hydrops fetalis
రకాలుMature, immature
కారణాలుUnknown
రోగనిర్ధారణ పద్ధతిముక్క పరీక్ష
భేదాత్మక నిర్ధారణLipoma, dermoid, myelomeningocele
చికిత్సశస్త్రచికిత్స, chemotherapy
తరచుదనం1 in 30,000 newborns (tailbone)

ఇది అపరిపక్వం, పరిపక్వం అనే రెండు రకాలుగా విభజించబడింది. సాధారణంగా పరిపక్వమైన టెరటోమాస్ బెనిగ్న్, డెర్మొయిడ్ సైస్ట్స్ (Dermoid cysts) ని కలిగి ఉంటుంది. అపరిపక్వమైన టెరటోమాస్ కాన్సర్ ని కలిగించవచ్చు. అధిక ఓవెరియన్ టెరటోమాస్ పక్వమైనది. పెద్దవాళ్లలో వచ్చే టెస్టిక్యూలర్ టెరటోమాస్ సాధారణంగా కాన్సర్ ని కలిగించవచ్చు. టిష్యూ భయాప్సీ (Tissue biopsy) ద్వారా రోగాన్ని నిర్ధారించవచ్చు. 

టెయిల్ బోన్, టెస్టిక్యూలర్, ఓవెరియన్ టెరటోమాస్ యొక్క చికిత్స సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది. టెస్టిక్యూలర్, అపరిపక్వ టెరటోమాస్ తరచు కెమోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు.       

ప్రస్తుత కాలంలో జన్మించే శిశువులలో 30,000 లో ఒకరికి టెయిల్ బోనస్లో టెరాటోమాలు సంభవిస్తాయి. ఈ వయసులో అత్యంత సాధారణ సంభవించు కణితిలలో ఇది ఒకటి. ఈ వ్యాధికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అండాశయ కణితులలో నాలుగో వంతు అండాశయ టెరటోమాస్లలను సూచిస్తుంది. సాధారణంగా మధ్య వయసులో ఉండే వారిలో దీనిని గమనించవచ్చు. ఇవి పిల్లలు, పెద్దవారిలోను సంభవించవచ్చు. 

సంకేతాలు , లక్షణాలుసవరించు

శిశువులు, పిల్లలు, పెద్దవారిలోను టెరటోమాస్ ను గమనించవచ్చు. పిండములలో అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ యొక్క ఆగమనంతో పిండోత్పత్తి మూలంగా వచ్చే టెరటోమాస్ ను పుట్టినపిల్లలు, చిన్నపిల్లలలో తరచూ కనుగొన్నారు. 

సాక్రియోకాసిజల్ టెరాటోమా (Sacrococcygeal Teratoma), సెర్వికల్  టెరటోమా (Cervical Teratoma) సాధారణంగా నిర్ధారించే ఫెటల్ టెరటోమా (Fetal Teratoma). పిండ శరీరం నుండి చుట్టుపక్కల ఉమ్మనీటి సంచిలోకి చుచ్చుకుపోవటం వాళ్ళ, వీటిని సాధారణంగా  నెలలోపు చేసే అల్ట్రాసౌండ్ పరీక్షలలో చూడవచ్చు. పిండ శరీరం లోపల ఉన్న టెరటోమాస్ ని అల్ట్రాసౌండ్ ద్వారా చూడటం కష్టం. దీనిని గర్భిణి గర్భాశయం యొక్క ఎంఆర్ఐ ద్వారా కనుగొనవచ్చు.

సమస్యలుసవరించు

మాస్ ఎఫెక్ట్ (mass effect) లేదా కణితి ద్వారా పెద్ద మొత్తములో రక్తప్రసరణ జరగనంతవరుకు పిండానికి టెరటోమాస్ వాళ్ళ ఎటువంటి ప్రమాదం ఉండదు. మాస్ ఎఫెక్ట్ తరచుగా పరిసర అవయవాల నుండి ద్రవాల యొక్క ప్రవాహానికి అడ్డంకిని కలిగి ఉంటుంది. పిండం యొక్క పెరుగుతున్న హృదయంపైన వాస్కులర్ స్టీల్ (Vascular steal) ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె ఆగిపోవుటకు దారి తీయవచ్చు. కావున దీనిని ఫెటల్ ఎఖోకార్డియోగ్రఫీ (Fetal Echocardiography) ద్వారా పర్యవేక్షించాలి.  

N- మిథైల్- D- ఆస్పార్టేట్ (NMDA) రిసెప్టర్ ఎన్సెఫాలిటిస్ అనబడే ఒక స్వయం ప్రతిరక్షక అనారోగ్యాన్ని టెరటోమాస్ కలిగించవచ్చు. ఈ పరిస్థితిలో టెరాటోమాలు NMDA- రిసెప్టర్ నిర్దిష్టతలతో B కణాలు కలిగి ఉండవచ్చు. 

శస్త్రచికిత్స తరువాత, కణితను తొలగించిన స్థలంలో కానీ లేదా సమీపంలోని అవయవాలలోకాని తిరిగి పెరగడానికి అవకాశం ఉంది.

రకాలసవరించు

పరిపక్వ టెరటోమాసవరించు

పరిపక్వ టెరాటోమ ఒక గ్రేడ్ 0 టెరాటోమ. పరిపక్వ టెరటోమా రూపంలో అస్థిరమైనిది. ఇది ఘన స్థితి, సిస్టిక్ (cystic) లేదా ఘన, సిస్టిక్ యొక్క కలయిక కూడా అయ్యి ఉండొచ్చు. ఒక పరిపక్వ టెరటోమా తరచుగా చర్మం, కండర, ఎముక వంటి అనేక రకాల కణజాలాలను కలిగి ఉంటుంది. చర్మం ఒక తిత్తిని చుట్టుకొని జుట్టును సమృద్ధిగా పెంచుతుంది. ప్రాణాంతక పరిపక్వ టెరటోమాస్ విభిన్న రకాలు ఉన్నాయి.

డెర్మోయిడ్ తిత్తిసవరించు

డెర్మోయిడ్ తిత్తి వెంట్రుకలు, మాములు చర్మం లక్షణాలు ఉన్నటువంటి ఆకారాలు, ఎక్టోడెర్మ్ నుండి ఉద్భవించిన ఇతర కణజాలలను కలిగిన ఒక పరిపక్వ సిస్టిక్ టెరటోమా.

"https://te.wikipedia.org/w/index.php?title=టెరటోమా&oldid=2891003" నుండి వెలికితీశారు