టెలిగ్రామ్ ఒక మెసేజింగ్ యాప్. దీనికి ఇంటర్నెట్ ఉంటే చాలు.ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు.ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా దీనిని ఉపయోగించే వినియోగదారులు ఎక్కువయ్యారు.ఇతరులు చూడకుండా ఈ సేవ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్. ఆండ్రాయిడ్ ఫోన్లో కొరకు 14 ఆగస్టు 2013 విడుదల చేశారు.

టెలిగ్రామ్
ప్రారంభ విడుదల14 ఆగస్టు 2013; 11 సంవత్సరాల క్రితం (2013-08-14)
రిపోజిటరీ
Edit this at Wikidata
అందుబాటులో ఉంది58 భాషలు[1][2]
List of languages
ఇంగ్లీష్, హిందీ, రష్యన్, పర్షియన్, టర్కిష్, ఇటాలియన్, అరబిక్, ఉక్రేనియన్, ఉజ్బెక్ , పోర్చుగీస్, స్పానిష్, జర్మన్, డచ్, ఫ్రెంచ్, కొరియన్, ఇండోనేషియన్ ,మలేయ్,బెలారసియన్,కాటలాన్ ,పోలిష్ [3]
జాలస్థలిtelegram.org Edit this on Wikidata

టెలిగ్రామ్ లో ఫీచర్స్

మార్చు
  • టెలిగ్రామ్‌లో 2017 నుండి పేమెంట్ బోట్ ఉంది. ఇది సురక్షితమైన పద్ధతిలో చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వ్యాపారులు ఏదైనా చాట్‌లో క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించగలరు. చెల్లింపు ఇప్పుడు ఏ యాప్ నుండి అయినా చేయవచ్చు. కంపెనీ ఇందులో ఎలాంటి కమీషన్ వసూలు చేయదు లేదా చెల్లింపు వివరాలను తనతో సేవ్ చేయదు.
  • టెలిగ్రామ్‌లో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు. గ్రూప్ అడ్మిన్‌లు, ఛానెల్‌లు తేదీ అలాగే సమయాన్ని నమోదు చేయడం ద్వారా వాయిస్ చాట్‌లను షెడ్యూల్ చేయవచ్చు.
  • టెలిగ్రామ్‌లో రెండు పూర్తి ఫీచర్డ్ టెలిగ్రామ్ వెబ్ యాప్‌లకు జోడించారు. రెండూ యానిమేటెడ్ స్టిక్కర్లు, డార్క్ మోడ్, చాట్ ఫోల్డర్‌లు వంటి అనేక ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తాయి. డెస్క్‌టాప్ లేదా మొబైల్ – ఏ పరికరంలోనైనా మీరు మీ చాట్‌లకు తక్షణ ప్రాప్యతను కలిగి ఉంటారు.
  • ఈ యాప్ ప్రజాదరణ పొందడానికి ఒక కారణం ఇక్కడ నుండి సినిమాలు-వెబ్ సిరీస్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోగలిగే అవకాశం ఉండటం. వాటిని దాని యాప్ లేదా వెబ్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, టెలిగ్రామ్ దీనికి అధికారికంగా మద్దతు ఇవ్వదు. ఈ డౌన్‌లోడ్స్ పూర్తిగా అనధికరికం. అయినప్పటికీ పెద్ద ఫైల్స్ ను సులభంగా టెలిగ్రామ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన సోషల్ మీడియా యాప్‌లలో ఇటువంటి అవకాశం లేదు. వాస్తవానికి, చాలా మంది వినియోగదారులు ఈ యాప్‌లో చలనచిత్రాలను అప్‌లోడ్ చేసే లేదా వారి లింక్‌లను షేర్ చేసే ఛానెల్‌లను సృష్టించారు. అటువంటి పరిస్థితిలో, సినిమా లేదా వెబ్ సిరీస్‌ని శోధించడం ద్వారా ఈ ఛానెల్‌లను చేరుకోవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇక్కడ నుండి మీరు వాటిని ఎలాంటి యాడ్-ఆన్‌లు లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెన్సార్ టవర్ నివేదిక

మార్చు

సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం, టెలిగ్రామ్ భారతదేశంలో రెండవ అతిపెద్ద వినియోగదారులను కలిగిన సోషల్ మీడియా యాప్. టెలిగ్రామ్ కొరకు అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందింది. వాటిలో 22 శాతం లైఫ్‌టైమ్ ఇన్‌స్టాల్‌లు. భారతదేశం తర్వాత, రష్యా, ఇండోనేషియా ఈ యాప్ కోసం రెండు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. వాటి నుంచి మొత్తం ఇన్‌స్టాల్‌లలో వరుసగా 10 శాతం, 8 శాతం వచ్చింది.

డౌన్‌లోడ్

మార్చు

టెలిగ్రామ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1 బిలియన్ కంటే ఎక్కువ అంటే 100 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెబుతున్న దాని ప్రకారం మెసేజింగ్ యాప్‌లో 2021 ప్రారంభంలో 500 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. గత 15 రోజుల్లో చాలా మంది వినియోగదారులు టెలిగ్రామ్‌లో చేరారు. ఈ సమయంలో 70 మిలియన్లకు పైగా (70 మిలియన్లు) వినియోగదారులు టెలిగ్రామ్‌కు కనెక్ట్ అయ్యారని డ్యూరోవ్ చెప్పారు.

మూలాలు

మార్చు
  1. https://translations.telegram.org/
  2. "Telegram Messenger". LLP. Archived from the original on 2 October 2003. Retrieved 25 February 2021.
  3. "List of Telegram applications". 6 February 2014. Archived from the original on 22 May 2016. Retrieved 6 February 2014.