ట్యాంక్ మ్యాన్ (అజ్ఞాత నిరసనకారుడు లేదా అజ్ఞాత తిరుగుబాటుదారుడు పేర్లతోనూ పిలుస్తారు) అన్నది జూన్ 5, 1989న తియాన్మెన్ స్క్వేర్ నిరసనలను చైనీస్ మిలటరీ బలంతో అణచివేసిన తర్వాతి రోజు ఉదయం ట్యాంకుల వరుసకు ముందు నిలబడిన గుర్తుతెలియని మనిషికి మారుపేరు. మొదటి ట్యాంకు అతన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్దామని ప్రయత్నిస్తే ఆయన నిల్చున్న స్థానాన్ని మారుస్తూ ట్యాంకు మార్గాన్ని పదేపదే నిరోధించారు. ఈ సంఘటన చిత్రీకరించగా ప్రపంచవ్యాప్తంగా చూశారు.

జూన్ 5, 1989న "ట్యాంక్ మ్యాన్" బీజింగ్ లో తాత్కాలికంగా ట్యాంకుల వరుసను అడ్డుకున్న దృశ్యం, 20వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ ఛాయాచిత్రం.[1][2][3] ఈ ఫోటో (సరిగ్గా ఇలాంటివే అయిన మరో నాలుగు వెర్షన్లలో ఇదొకటి)ను అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన జెఫ్ వైడనర్ తీశారు.

ఈ సంఘటన జరిగి దశాబ్దాలు గడిచినా అతను ఎవరో, ఏమయ్యాడో తెలిదు; ట్యాంక్ సిబ్బందికి ఏమైందన్న వివరాలూ తెలియరాలేదు.[4] ఒక ప్రత్యక్ష సాక్షి మాత్రం ఆ కాలంలో ట్యాంకులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినది ఒక్క ట్యాంక్ మ్యాన్ మాత్రమే కాదన్నారు. విద్యార్థి నాయకుడు షావో జియాంగ్ అన్న ఆ సాక్షి తాను ఆ కాలంలో పలవురు వ్యక్తుల ఒంటరిగా ట్యాంకులకు ఎదురొడ్డి నిలబడి వాటి మార్గాన్ని నిరోధించడం చూశానన్నారు.[5] వీరిలో ట్యాంక్ మ్యాన్ సాహసం మాత్రమే [[[ఛాయాచిత్రం|[ఛాయాచిత్రాlu]]|ఛాయాచిత్రాల్లో]]నూ, వీడియోలోనూ రికార్డు కావడంతో ఈ చిత్రాలు మిగతా ప్రపంచానికి చేరాయి.

మూలాలు

మార్చు
  1. Witty, Patrick (June 3, 2009). "Behind the Scenes: Tank Man of Tiananmen". The New York Times.
  2. Floor Speech on Tiananmen Square Resolution. Nancy Pelosi, Speaker of the U.S. House of Representatives. June 3, 2009.
  3. Corless, Kieron (May 24, 2006). "Time In – Plugged In – Tank Man". Time Out.
  4. Photographer Jeff Widener BBC interview (2014, video)
  5. Shao Jiang interview (Amnesty International, video posted on 2014May28 for 25th anniversary)
    Among those interviewed include photographer Stuart Franklin with Magnum for Time who was on the 5th floor balcony of the Beijing Hotel.