ట్రాక్టర్

బరువైన పనులకు వాడే ఒక వాహనం
(ట్రాక్టరు నుండి దారిమార్పు చెందింది)

ట్రాక్టర్ అనగా వ్యవసాయ పనుల్లోనూ, నిర్మాణ రంగంలోనూ ఎక్కువగా వాడుకలో ఉన్న, నెమ్మదిగా, బలంగా లాగగలిగే సామర్థ్యం కలిగిన ఒక వాహనం. మొదట్లో ఇవి నీటిఆవిరిచే నడపబడే దున్నే యంత్రాలుగా ఉపయోగించే వారు. పొలానికి రెండు వైపులా వీటిని ఉంచి నాగళ్ళను వీటి సాయంతో అటు ఇటు లాగుతూ దున్నేవారు.

అత్యంత ఆధునికమైన యూరోపియన్ వ్యవసాయ ట్రాక్టర్

ట్రాక్టర్ అనే పదం trahere అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి అర్థం లాగగలిగేది అని. [1], [2]1901 లో మొట్టమొదటి సారిగా నాగళ్ళను కానీ, బగ్గీలను కానీ లాగగలిగే యంత్రాలను లేదా వాహనాలను ట్రాక్టర్ గా పిలవడం మొదలుపెట్టారు. అప్పటి దాకా వీటిని ట్రాక్షన్ ఇంజిన్ అని పిలిచేవారు. [3]

చరిత్ర

మార్చు

19వ శతాబ్దం మొదట్లో పోర్టబుల్ ఇంజన్లు ఉండేవి. పోర్టబుల్ ఇంజన్ అంటే చక్రాల బండి మీద ఏర్పాటూ చేసిన ఒక ఆవిరి యంత్రం. భారతదేశంలో మహీంద్రా, స్వరాజ్ లాంటి కొన్ని కంపెనీలు ట్రాక్టర్లను ప్రధానంగా ఉత్పత్తి చేస్తాయి.

ఉపయోగాలు

మార్చు

వ్యవసాయం

మార్చు

దుక్కిదున్నడం, ధాన్యాన్ని గడ్డి నుంచి వేరు చేయడానికి, పంటలను ఇళ్ళకు, మార్కెట్ కు చేరవేయడానికి ప్రస్తుతం ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉద్యానవనాల్లో గడ్డిని కత్తిరించడానికి చిన్న ట్రాక్టర్లను వాడతారు.

నిర్మాణ రంగం

మార్చు

నిర్మాణాలకు అవసరమైన మట్టి, కంకర, ఇసుక, సిమెంటు, ఇటుకలు మొదలైన ముడి సామాగ్రిని చేరవేయడానికి ఉపయోగిస్తారు.

మూలాలు

మార్చు
  1. Houghton Mifflin (2000). The American Heritage Dictionary of the English Language (4th ed.). Boston and New York: Houghton Mifflin. p. 1829. ISBN 978-0-395-82517-4. Archived from the original on 2012-01-12. Retrieved 2009-05-08.
  2. Merriam-Webster Unabridged (MWU). (Online subscription-based reference service of Merriam-Webster, based on Webster's Third New International Dictionary, Unabridged. Merriam-Webster, 2002.) Headword tractor. Accessed 2007-09-22.
  3. ""Tractor"". (etymology). Online Etymology Dictionary. Retrieved 2008-06-02.