ట్రెడల్ పంపు అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు[1]. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పనిచేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలాన్ని చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.

A sketch of a treadle pump .
ట్రెడిల్ పంప్ యొక్క ఉదాహరణ.

అనువర్తనాలు మార్చు

ట్రెడల్ పంపులు వర్షాధార నీటిపారుదలపై ఆధారపడే స్వేచ్ఛా రైతులకు, తక్కువ పొలం ఉన్న రైతులకు అధిక లాభాలను ఇవ్వటంలో సహాయపడతాయి. ట్రెడల్ పంపు ఎక్కువభాగం మోటారు పంపు వలె పనిచేస్తుంది, కానీ ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే దీనిని పనిచేయించడానికి ఇంధన అవసరం లేదు, ఇది ఆపరేటర్ల యొక్క శరీర బరువు, కాలి కండరాల శక్తితో నడుపబడుతోంది, అంతేకాక ఇది మోటారు పంపు కంటే చాలా తక్కువ వెలకి వస్తుంది. ఇది మోటారు పంపు కన్న 50 శాతం ధర తక్కువ ఉంటుంది. ఇది గంటకు ఐదు నుండి ఏడు ఘనపు మీటర్ల నీటిని బావులనుండి, బోర్ రంధ్రములనుండి ఏడుమీటర్ల ఎత్తుకు తీసుకొనిపోయే సామర్థ్యం కలిగి యుంది. ఇది సరస్సులనుండి, నదులనుండి నీటిని తోడుటకు కూడా ఉపయోగపడుతుంది. దీనిని స్థానికంగా ఉత్పత్తిచేస్తున్నారు. దీని ఉత్పత్తిని నైపుణ్యము గల వల్డర్లు, ఉత్పాదక హార్డువేర్ లేకుండా ఉత్పత్తిచేయుటకు సవాలుగా తీసుకొని స్థానికంగా తయారుచేస్తున్నారు.

ఈ పంఫులు సాధారణంగా రైతులు, చిన్న భూకమతాలు గలవారు, ఒక ఎకరా భూమి కలిగినవారు ఎక్కువగా వాడతారు. ఈ పంపును పేదదేశాలలోనూ, చిన్నగ్రామాల లోను అనగా ఆఫ్రికా లోని గ్రామాలు, ఆసియాలోని చిన్న రైతులు, ద్రవ్యసమస్యతో బాధపడు ఇతర ప్రాంతాలలో కూడా వాడుతున్నారు.

చరిత్ర మార్చు

ఈ ట్రెడిల్ పంపు 1980 లో రంగపూర్ దినజ్‌పూర్ రూరల్ సర్వీసు (RDRS) లో వ్యవసాయ కోఆర్డినేటరుగా పనిచేయుచున్న "గున్నార్ బార్నెస్" అనే ఇంజనీరు ఆవిష్కరించెను. RDRS 1975 లలో అధిక సామర్థ్యం కలిగిన తక్కువ ఖర్చుతోకూడిన పంపుల కోసం నిరంతరం అన్వేషిస్తూ అనేక రకాల పంపుల రకాలను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈ స్ంస్థ 1980-81 మధ్యలో ఒక నెలకు 3000 తయారుచేసే స్థానిక వర్క్‌షాపులను ఏర్పాటుచేసింది. కొన్ని సంవత్సరముల తర్వాత బంగ్లాదేశ్ లో ఐ.డి.ఇ స్థాపించిన తరువాత ఈ పంపుల మార్కెటింగ్ ను విస్తరించింది.[2]

ప్రారంభ అభివృద్ధి మార్చు

పేదలతో కలసి పనిచేసి RDRS మానవీయమైన సరసమైన ధరకు వ్యవసాయానికి ఈ పంపును ఉత్పత్తిచేశారు.[3] ఈ పంపు ముఖ్య ఉద్దేశం 0.5 హెక్టార్ల గోధుమ పంటను పండించుటకు నిర్దేశించుట. ఈ పంపు ఖర్చు, దానిని అమర్చే ఖర్చు ఒక ధాన్యం బస్తా ధర కంటే ఎక్కువ ఉండరాచు. ఈ పంపు స్థానికంగా ఏ సమస్యలు వచ్చినా బాగుచేసే విధంగా ఉండాలి. దీనికోసం వెదురు బొంగుల చట్రం, ఇతర స్థానిక పరికరాలు వినియోగించబడినవి.అనేక డిజైన్లను పరిశీలించి అధిక నాణ్యత కల పంపును తయారుచేశారు.ట్రెడిల్ పంపుకు ముందు గల చివరి డిజైన్ "వై.పంపు". దీనిలో రెండు సిలిండర్లు కలసి వెల్డింగ్ చేయబడి "Y " ఆకారంలఒ తయారుచేయబడింది. దీనిని చేతితో నడిపే చట్రం. దీనిలో పాదానికి చేతులు సహకారం అందించే విధంగా తయారుచేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్, భారత దేశంలో చేతిపంపుల పరిశ్రమలలో అధిక సమర్థవంతమైన పంపును తయారుచేసారు.

ఈ ట్రెడిల్ పంపు 1980 లో మొట్టమొదటిసారి పరిచయం కాబదింది. RDRS వర్క్ షాపులో రోజుకు డిమాండును బట్టి 20 పంపులు ఉత్పత్తి చేయబడినవి. 1982 తర్వాత వివిధ మోడళ్ళలో ఈ పంపులు తయారు చేయబడినవి: ట్విన్ ట్యూబ్‌బెల్, ట్విన్ డగ్‌వెల్, ట్విన్ లో-లిఫ్ట్ మొదలగునవి. దీనిలో ట్విన్ ట్యూబ్‌వెల్ గృహ వినియోగంలో త్రాగునీటి కోసం వాడబడుతున్నది.[4]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Alistair Orr, A.S.M. Nazrul Islam, and Gunnar Barnes. 1991. The Treadle Pump: manual irrigation for small farmers in Bangladesh. R.D.R.S.
  2. "Ashden Award, 2006 winner Award given to [[International Development Enterprises]] (IDE), India, for their work in developing treadle pump". Archived from the original on 2008-02-24. Retrieved 2014-04-05.
  3. RDRS Annual Reports, 1980-1984
  4. Carl Bielenberg and Hugh Allen. 1995. How to make and use the treadle irrigation pump. Intermediate Technology Publications.

ఇతర లింకులు మార్చు