ట్రోవులన్
ట్రోవులన్ అనేది ఇండోనేషియాలోని తూర్పు జావాలోని మోజోకెర్టో రీజెన్సీలోని ట్రోవులన్ ఉపజిల్లాలోని ఒక పురావస్తు హిందు ధార్మిక ప్రదేశం. ఇక్కడ వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పురావస్తు ప్రదేశంగా గుర్తించబడింది. పురాతన మజాపాహి రాజవంశానికి ఈ నగరం రాజధానిగా ఉండేది. ఎంపు ప్రభంక దీనిని 14వ శతాబ్దానికి చెందిన నగరక్రేటగామ అనే పద్యం ద్వారా, 15వ శతాబ్దపు చైనా శాసనంలో పేర్కొన్నాడు. ఈ నగరం మజాపాహి రాజవంశానికి రాజధానిగా ఉంది, దీనికి విల్వాటిక అని పేరు పెట్టారు. ఆ పేరు సామ్రాజ్యం పేరుకు పర్యాయపదంగా ఉండేది. 1478లో గిరింద్రవర్ధనుడు కీర్తభూమిపై దాడి చేయడంతో ఈ నగరం నాశనమైంది. ఈ దాడి తరువాత, మజాపాహి రాజధాని దహా (కేదిరి)కి మార్చబడింది. ట్రోలాన్ మ్యూజియంలో ఇక్కడి నుండి తెచ్చిన కళాఖండాలు ఉన్నాయి.[1][2]
ట్రోవులన్ దేవాలయం | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ శైలి | క్యాండీ ఆఫ్ ఇండోనేషియా |
పట్టణం లేదా నగరం | తూర్పు జావాలోని మోజోకెర్టో రీజెన్సీలోని ట్రోవులన్ ఉపజిల్లా |
దేశం | ఇండోనేషియా |
భౌగోళికాంశాలు | 7°32′30.80″S 112°23′27.54″E / 7.5418889°S 112.3909833°E |
పూర్తి చేయబడినది | 14th–15 శతాబ్దాల మధ్యకాలం |
క్లయింట్ | మజాపాహి రాజవంశం |
చరిత్ర
మార్చునగరక్రేటగామలో మజాపాహి ప్యాలెస్, దాని పరిసరాల వర్ణనలు ఈ ఆలయంలో ఉన్నాయి. కానీ దాని రాజరిక, మతపరమైన వివరాలు మాత్రమే ఇందులో కనిపిస్తాయి. కొన్ని వివరాలు అస్పష్టంగా ఉన్నందున, సామ్రాజ్యం రాజధాని రూపకల్పన నుండి వివిధ నిపుణులు వేర్వేరు నిర్ధారణలకు వచ్చారు.[3]
ట్రోలువన్ వద్ద ప్రారంభ త్రవ్వకాలు దేవాలయాలు, సమాధులు, పుణ్యక్షేత్రాలు వంటి స్మారక చిహ్నాల చుట్టూ జరిగాయి. ఇటీవలి పురావస్తు త్రవ్వకాల్లో పరిశ్రమ, వాణిజ్యం, మతం, జనసాంద్రత కలిగిన ప్రాంతాలు, నీటిపారుదల పథకాలు, కాలువలు వంటి ఇతర పౌర అంశాల అవశేషాలు బయటపడ్డాయి. 14వ, 15వ శతాబ్దాలలో ఇక్కడ ఉన్న జనసాంద్రత కలిగిన నగరానికి ఈ తవ్వకాలే సాక్ష్యాలు. అక్టోబర్ 2009లో, ఇండోనేషియా సంస్కృతి, పర్యాటక మంత్రిత్వ శాఖ ట్రోలాన్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో దీనిని చేర్చింది. పునర్నిర్మాణానికి ముందు 1929లో బజాంగ్ రాటు నగరక్రేటగామ పురాణం ప్రకారం, రాజ సముదాయం చుట్టూ ఎర్రటి ఇటుకతో కట్టిన మందపాటి గోడ ఉంది. దాని పక్కనే వాచ్ టవర్ ఉంది. రాజభవనానికి ప్రధాన ద్వారం ఉత్తర గోడపై ఉంది. వీటిలో పెయింటింగ్స్‌తో కూడిన పెద్ద ఇనుప తలుపులను బిగించారు. ఉత్తర ద్వారం వెలుపల ఒక ఎత్తైన భవనం ఉంది. ఇక్కడే రాజకీయ సభ్యులు సమావేశమవుతారు.
ఆవిష్కరణ
మార్చు19వ శతాబ్దంలో ట్రోవులన్‌లో పురాతన నగరం అవశేషాలు, కనుగొనబడ్డాయి. 1811 నుండి 1816 వరకు డచ్ ఈస్ట్ ఇండీస్ గవర్నర్ సర్ థామస్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ ద్వీపం చరిత్రపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న దేవాలయాల శిథిలాల గురించి అతను నివేదించాడు.[4]
పురావస్తు ప్రదేశాలు
మార్చుట్రోవులన్లో లభించిన చాలా పురావస్తు అవశేషాలు ట్రోవులన్ మ్యూజియంలో ఉంచబడ్డాయి. ఈ మ్యూజియం సెగరెన్ సరస్సుకి దక్షిణం వైపున ఉంది. ట్రౌలాన్ లోపల, చుట్టుపక్కల త్రవ్వకాలు పురాతన నాగరికతలోని వివిధ ప్రాంతాలు అనేక మీటర్ల మట్టి, అగ్నిపర్వత బూడిదతో కప్పబడి ఉన్నాయని చూపుతున్నాయి. ట్రోలాన్‌లో అనేక పురావస్తు అవశేషాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. చాలా వరకు ధ్వంసమయ్యాయి. అనేక ఇతర వస్తువుల పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఎర్ర ఇటుకతో పునర్నిర్మాణం జరుగుతోంది.[5]
పురావస్తు త్రవ్వకాల్లో ఇళ్ల అంతస్తులు, గోడల పై ఇటుకలు బయటపడ్డాయి. కొన్ని సందర్భాల్లో, వీటిలో రెండు లేదా మూడు పొరలు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉంటాయి. ఇటుకలు, మట్టితో చేసిన పెద్ద రిజర్వాయర్లు, బావులు ఇక్కడ కనుగొనబడ్డాయి.
పరిశ్రమలు
మార్చుతూర్పు జావాలోని వివిధ ప్రాంతాల్లో ఈ కాలానికి చెందిన అనేక బంగారు ఆభరణాలు కనుగొనబడ్డాయి. జావాలో బంగారు వనరులు లేవని చెప్పవచ్చు కానీ బంగారం సుమత్రా, బోర్నియో, సులవేసి నుండి దిగుమతి అవుతుంది. ఇది జావాలో చాలా మంది స్వర్ణకారులకు ఉపాధిని కూడా ఇస్తుంది.[6]
మూలాలు
మార్చు- ↑ Millet, Didier (August 2003). John Miksic (ed.). Indonesian Heritage Series: Ancient History. Singapore 169641: Archipelago Press. p. 108. ISBN 981-3018-26-7.
{{cite book}}
: CS1 maint: location (link) - ↑ Sita W. Dewi (9 April 2013). "Tracing the glory of Majapahit". The Jakarta Post. Retrieved 5 February 2015.
- ↑ "Sir Stamford Raffles | British colonial agent". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2017-11-15.
- ↑ "Candi Bajangratu". Perpustakaan Nasional. Archived from the original on 2022-06-16. Retrieved 2021-12-07.
- ↑ "Bayang-bayang Sebuah Kejayaan". 5 జనవరి 2009. Archived from the original on 12 జనవరి 2009.
- ↑ "Taman Majapahit Dibangun di Trowulan". 4 నవంబరు 2008. Archived from the original on 7 నవంబరు 2008.