డబ్లిన్
డబ్లిన్ ఐర్లండ్ దేశపు రాజధాని, అతి పెద్ద నగరం.[1][2] తూర్పు సముద్రతీరంలో, లిఫ్ఫీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఇది లీన్‌స్టర్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. ఇది దక్షిణాన విక్లో పర్వతాల శ్రేణిలో భాగమైన డబ్లిన్ పర్వతాల సరిహద్దులో ఉంది. పట్టణ ప్రాంత జనాభా 1,173,179 కాగా, 2016 నాటికి డబ్లిన్ ప్రాంతం (గతంలో డబ్లిన్ కౌంటీ) జనాభా 1,347,359.[3] గ్రేటర్ డబ్లిన్ ప్రాంతం జనాభా 2016 జనాభా లెక్కల ప్రకారం 1,904,806.[4]
సా.శ 7 వ శతాబ్దంలో లేదా అంతకు ముందు డబ్లిన్ నగరాన్ని గేల్స్ ఎక్కడ స్థాపించారు అనే విషయంపై పురావస్తు చర్చ ఉంది.[5] నార్మన్ దండయాత్ర తర్వాత డబ్లిన్ సామ్రాజ్యంలో వైకింగ్ సెటిల్మెంట్ గా విస్తరించబడింది. ఈ నగరం 17వ శతాబ్దం నుంచి వేగంగా విస్తరించబడింది. 1800 లో యూనియన్ యాక్ట్స్ ప్రకారం బ్రిటన్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండవ అతిపెద్ద నగరంగా విలసిల్లింది. 1922 లో ఐర్లండ్ విభజన తర్వాత ఐరిష్ ఫ్రీ స్టేట్ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లాండ్ గా మార్చారు.
డబ్లిన్ ఒక చారిత్రాత్మక నగరం. ఇది సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఇది మొదటి ముప్ఫై ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటి.[6][7]
మూలాలు
మార్చు- ↑ "The Growth and Development of Dublin". Archived from the original (PDF) on 30 March 2013. Retrieved 30 December 2010.
- ↑ "Primate City Definition and Examples". Retrieved 21 October 2009.
- ↑ "Sapmap Area – NUTS III – Dublin Region". Census 2016. Central Statistics Office. 2016. Archived from the original on 16 January 2018. Retrieved 16 January 2018.
- ↑ "Population Distribution – CSO – Central Statistics Office". Retrieved 4 February 2018.
- ↑ Dickson, David (2014). Dublin The Making of a Capital City. Profile Books Ltd. pp. x. ISBN 978-0-674-74444-8.
- ↑ "Global Financial Centres Index 8" (PDF). Archived from the original (PDF) on 11 October 2010. Retrieved 30 December 2010.
- ↑ "The World According to GaWC 2018". Globalization and World Cities Research Network: Loughborough University. 13 November 2018. Retrieved 23 November 2018.