దివంగత బ్రిటన్‌ యువరాణి.. డయానా జ్ఞాపకార్థం డయానా అవార్డ్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేస్తున్న 9 - 25 ఏళ్ల మధ్య వయస్కులకు ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు.

డయానా అవార్డు
స్థాపన1999వ సంవత్సరం
రకంRegistered Charity and Company limited by guarantee
కేంద్రీకరణయువత
కార్యస్థానం
  • లండన్, యూకె
సేవా ప్రాంతాలుఅంతర్జాతీయ అవార్డు
సేవలు
  • The Diana Award
  • The Legacy Award

అంతర్జాతీయ పురస్కారం

మార్చు

బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్‌ రాజకుమారి డయానా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9 నుంచి 25 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారికి ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనువడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారకరామారావు తనయుడు హిమాన్షురావు(15)కి 2021 సంవత్సరానికిగాను అంతర్జాతీయ పురస్కారంమైన డయానా అవార్డు[1] దక్కింది. హిమాన్ష్‌ Shoma అనే పేరుతో గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్‌, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు.[2] 2020 సంవత్సరం ప్రిన్సెస్ డయానా అవార్డును అందుకున్న వారిలో 16 మంది భావిభారత పౌరులు ఉన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఈ వేడుక దృశ్య మాధ్యమంగా జరిగింది.

చరిత్ర

మార్చు

డయానా అవార్డు ఇతరుల జీవితాలను మెరుగుపర్చడానికి పనిచేసే యవతను సత్కరిస్తుంది. ఈ అవార్డు 9-25 సంవత్సరాల వయస్సు గల యువత వారి సామాజిక సేవకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రశంస. డయానా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పేరు మీద గోర్డాన్ బ్రౌన్ అధ్యక్షతన ఒక బోర్డు 1999 లో స్థాపించింది. దివంగత డయానా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గౌరవార్థం ఈ అవార్డును UK మాజీ ప్రధాన మంత్రి గోర్డాన్ బ్రౌన్ ప్రారంభించారు. డయానా అవార్డు యొక్క ప్రస్తుత పోషకులలో మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్, డేమ్ జూలియా శామ్యూల్, మాజీ స్కాటిష్ మొదటి మంత్రి జాక్ మక్కన్నేల్, ఎస్తేర్ రాంట్జెన్ CBE ఉన్నారు. ఈ సంస్థ డయానాకు స్వచ్ఛంద వారసత్వం. యువతను ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని వేల్స్ యువరాణి నమ్మకం. డయానా అవార్డు యొక్క ఉద్దేశ్యం కూడా యువ మానవతావాదులు, పర్యావరణ ప్రచారకులు, సమాజానికి నిస్వార్థ సహకారం అందించేవారు.. ఇలా ప్రపంచాన్ని మార్చగల యువతను గుర్తించి ప్రోత్సహించడమే.




మూలాలు

మార్చు
  1.   https://en.wikipedia.org/wiki/Diana_Award. వికీసోర్స్. 
  2. Namasthe Telangana (2 July 2021). "Himanshu : 'స్వచ్ఛమైన'ప్రేమ.. బ్రాండ్‌ శోమ". Namasthe Telangana. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.