డస్కీ లోరి (ప్సూడోస్ ఫస్కాటా) సిట్టాసిడే కుటుంబానికి చెందిన ప్సూడోస్ ప్రజాతిలోని ఏకైక చిలుక.[2] డస్కీ నారింజ లోరీ, వైట్ రంప్డ్ లోరి అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.[3] ఇది ఇండోనేషియా, ప్యాపువా న్యూ గినీ లలో కనిపిస్తుంది.

డస్కీ లోరీ
A dusky lory at the Cincinnati Zoo
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Pseudeos

Species:
P. fuscata
Binomial name
Pseudeos fuscata
(Blyth, 1858)

వివరణ మార్చు

డస్కీ లోరీ అనేది పొట్టి తోక కలగి, 25 సెం.మీ. పొడవు కల చిలుక. అంతా ఊదా రంగులో ఉన్నా, వీపు, రెక్క అంచులు తెల్లగా ఉంటాయి. వీటికి రెండు రంగుల దశలు ఉంటాయి. ఛాతీ పైభాగంలో ఒకా పట్టీ, పొట్ట, పసుపు రంగులో కానీ, నారింజ రంగులో కానీ ఉంటాయి. ముక్కు ముదురు నారింజ రంగులో ఉంటుంది. కింది దవడ మొదట్లో ఈకలు లేని నారింజ రంగు చర్మం ఉంటుంది. కనుపాపలు ఎర్రగా, కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి. మగవి, ఆడవి ఒకేరకంగా ఉంటాయి.పిల్లలు లేత పసుపు రంగు వీపు,రెక్క అంచులు కలిగి పసుపు బూడిద రంగులు కలిసిన కనుపాపలు కలిగి ఉంటాయి. ముక్కు మొదట్లో పసుపుగా ఉండి, చివరన ఊదారంగులో కానీ నల్లగా కానీ ఉంటుంది. ref name="Forshaw (2006). plate 8.">Forshaw (2006). plate 8.</ref>

విస్తరణ, నివాసం మార్చు

డస్కీ లోరీ సముద్ర మట్టానికి 2500 మీ ఎత్తున, ఇండోనేషియా,పపువా న్యూ గినియా, రెంటికీ చెందిన న్యూ గినియా దీవిలో ఉంటుంది. పక్కన ఉన్న ఇండోనేషియా దీవులైన సలావతి, యాపెన్ దీవులలో కూడా కనిపిస్తుంది.[3] దీని సహజ సిద్ధమైన నివాస స్థానాలు, ఉష్ణ, సమసీతోష్ణ ఎత్తైన చిత్తడి నేలలు, లోతట్టు చిత్తడి అడవులు, మడ అడవులు

వంటి రంగులు తెలిపే చిత్రాలు మార్చు

మూలాలు మార్చు

  1. BirdLife International (2012). "Pseudeos fuscata". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022)". www.zoonomen.net. 2009-03-28.
  3. 3.0 3.1 Forshaw (2006). page 28.

చూపగలిగిన పాఠాలు మార్చు

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.