డాల్ఫిన్ సముద్రపు నీటిలో, నదీ జలాల్లో నివసించే ఒక రకమైన క్షీరదము. డాల్ఫిన్ అనే పదాన్ని డెల్ఫినిడే (మహాసముద్ర డాల్ఫిన్లు), ప్లాటానిస్టిడే (భారత రివర్ డాల్ఫిన్లు ), ఇనిడే ( కొత్త ప్రపంచ నదీ డాల్ఫిన్లు), పొంటోపోరిడే ( ఉప్పునీటి డాల్ఫిన్లు), అంతరించిపోయిన లిపోటిడే (బైజీ లేదా చైనీస్ నది డాల్ఫిన్) అనే వాటన్నిటికీ వాడతారు. ఇవి సిటేషియాలో పెద్ద కుటుంబం. ఇవి సుమారు 10 మిలియన్ సంవత్సరాల కాలంలో అనగా మయోసీన్ కాలం నుండి పరిణామం చెందాయి. వీటిలో 40 జాతులు ఉన్నాయి.

డాల్ఫిన్
కాల విస్తరణ: తొలి Miocene - ప్రస్తుతం
బాటిల్నోస్ డాల్ఫిన్
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
డాల్ఫినిడే, Platanistoidea

Gray, 1821
ప్రజాతులు

See article below.


1.7-metre (5 ft 7 in) పొడవు 50-kilogram (110-pound) బరువు వుండే మౌయి డాల్ఫిన్ నుండి 9.5 m (31 ft 2 in), 10 టన్నులు వుండే ప్రాణాంతక తిమింగలం వరకు అనేక జాతులు లైంగిక డైమోర్ఫిజాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మగవి పెద్దవి. వాటికి క్రమబద్ధీకరించిన శరీరాలు, ఫ్లిప్పర్‌లుగా మారిన రెండు శరీర అంగాలుంటాయి. సీల్స్ వలె శరీరం సరళంగా లేనప్పటికీ, కొద్ది దూరాలకు, కొన్ని డాల్ఫిన్లు గంటకు 29 కి.మీ. (18 మైళ్లు) వేగంతో ప్రయాణించగలవు.[1] వేగంగా కదిలే ఎరను పట్టుకోవటానికి డాల్ఫిన్లు తమ శంఖాకార ఆకారపు దంతాలను ఉపయోగిస్తాయి. వాటికి గాలి, నీటిలో పనిచేసే బాగా అభివృద్ధి చెందిన వినికిడి వుంది. దీనివలన కొన్ని డాల్ఫిన్ లు గుడ్డివైనప్పటికీ మనుగడ సాగించుతాయి. కొన్ని జాతులు చాల లోతులకు దూకటానికి అనువుగా వున్నాయి. చల్లటి నీటిలో వెచ్చగా ఉండటానికి చర్మం కింద కొవ్వు పొర(బ్లబ్బర్) వుంటుంది.

ఇవి విస్తృతంగా ఉన్నప్పటికీ, చాలా జాతులు ఉష్ణమండల మండలాల వెచ్చని జలాలను ఎక్కువగా లోతు తక్కువగా ఉండే సముద్రపు అంచులలో వుండటానికి ఇష్టపడతాయి, అయితే కొన్ని తిమింగలం లాగా, శీతల వాతావరణాన్ని ఇష్టపడతాయి. డాల్ఫిన్లు ఎక్కువగా చేపలు, స్క్విడ్ లను ఆహారంగా తీసుకుంటాయి. కాని కొన్ని ప్రాణాంతక తిమింగలం లాంటివి, సీల్స్ లాంటి పెద్ద క్షీరదాలను తింటాయి. మగ డాల్ఫిన్లు సాధారణంగా ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ ఆడవాటితో సంగమిస్తాయి, కాని ఆడవి ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు మాత్రమే సంగమంలో పాల్గొంటాయి. దూడలు సాధారణంగా వసంత, వేసవి ఋతువులలో పుడతాయి. తల్లులే వాటిని పెంచే అన్ని బాధ్యతలను భరిస్తాయి. కొన్ని జాతుల తల్లులు ఉపవాసం వుంటూ తమ పిల్లలను చాలా కాలం పెంచుతాయి. డాల్ఫిన్లు సాధారణంగా టక టకలు, ఈలలు రూపంలో రకరకాల గాత్రాలను ఉత్పత్తి చేస్తాయి.

జపాన్ వంటి కొన్ని ప్రదేశాలలో డాల్ఫిన్లను వేటాడతారు. ఇతర చేపలవేటలో చిక్కుకొనడం, నివాసప్రాంతాల పర్యావరణం దెబ్బతినటం, సముద్ర కాలుష్యం లాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల సాహిత్యం, చిత్రాలలో డాల్ఫిన్లు వర్ణించబడ్డాయి. డాల్ఫిన్ లను జంతువులన్నింటిలో చాలా తెలివైనవిగా భావిస్తారు. ఇవి చాల స్నేహపూర్వకంగా, సరదాగా మానవులతో ఆడుకోగలవు. వీటిని పెంచే ప్రదేశాల్ని డాల్ఫినేరియమ్ అంటారు. డాల్ఫిన్‌లను జంతు ప్రదర్శనశాలలో వుంచి, కొన్ని నైపుణ్యాలు నేర్పి సందర్శకుల వినోదానికి వాడుతారు. జంతు ప్రదర్శనశాలలో వుండే అత్యంత సాధారణ డాల్ఫిన్ జాతి బాటిల్నోస్ డాల్ఫిన్ కాగా, ఇతర 60 రకాల ప్రాణాంతక తిమింగలాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో అంతరించి పోయే దశలో ఉన్న నదీ జలాల డాల్పిన్ లను సంరక్షించటానికి, కేంద్ర ప్రభుత్వం డాల్పిన్ ని జాతీయ జలచరంగా ప్రకటించింది.

పేరు ఉత్పత్తి మార్చు

డాల్ఫిన్ పేరు ప్రాచీన గ్రీకు (delphís; "dolphin"), సంబంధిత గ్రీకు భాషలో (delphys; "womb") నుండి వచ్చింది. ఈ జంతువులను గర్భాశయం కలిగిన చేపలుగా భావించి ఇలా పిలిచేవారు ("a 'fish' with a womb").[2]

వర్గీకరణ మార్చు

 
Common Dolphin
 
Bottlenose Dolphin
 
Spotted Dolphin
 
Commerson's Dolphin
 
Dusky Dolphin
 
Killer Whales, also known as Orcas
 
The Boto, or Amazon River Dolphin

మూలాలు మార్చు

  1. Grady, John M.; Maitner, Brian S.; Winter, Ara S.; Kaschner, Kristin; Tittensor, Derek P.; Record, Sydne; Smith, Felisa A.; Wilson, Adam M.; Dell, Anthony I.; Zarnetske, Phoebe L.; Wearing, Helen J. (2019-01-24). "Metabolic asymmetry and the global diversity of marine predators". Science. 363 (6425): eaat4220. doi:10.1126/science.aat4220. ISSN 0036-8075. PMID 30679341.
  2. The American Heritage® Dictionary of the English Language, Fourth Edition, online entry at Dictionary.com, retrieved December 17 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=డాల్ఫిన్&oldid=3687129" నుండి వెలికితీశారు