డిండి నది(దుందుభి నది) (River Dindi) మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలలో ప్రవహించే నది. ఇది కృష్ణానదికి ఉపనది. డిండి నది మహబూబ్ నగర్ జిల్లా పురుసంపల్లి కొండలలో జన్మిస్తుంది.[1] ఈ నదిపై నల్గొండ జిల్లాలో డిండి రిజర్వాయర్ నిర్మించబడింది. నాగర్ కర్నూల్ , నల్గొండ జిల్లాల సరిహద్దు గుండా నల్లమల అడవులలో ప్రవహించి నాగార్జునసాగర్లో కలుస్తుంది. డిండి నదిని దుందుభి నది అని కూడా పిలుస్తారు. దుందుభీ తీరాన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అతిప్రాచీన క్షేత్రం మామిళ్ళపల్లిని దుందుభీక్షేత్రంగా వ్యవహరిస్తారు. జడ్చర్ల మండలంలో దుందుభీ తీరాన ప్రాచీనమైన పరు శవేదీశ్వరాలయం ఉంది. ఈ క్షేత్ర సమీపంలో ప్రవహించే దుందుభిని వర్ణిస్తూ ప్రముఖ రచయిత గంగాపురం హనుమచ్ఛర్మ "దుందుభి" కావ్యాన్ని రచించాడు.

డిండి నది
డిండి జలాశయం

దీనికి 'డిండి' అని వ్యవహార నామం. ఈ నది ప్రస్తావన స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో గిరి ప్రదక్షిణ కల్పంలో ఉంది. ఈ నదీ తీరంలో దుందుభీశ్వరుడు వెలసినందు వల్ల "దుందుభి" అనే పేరు వచ్చింది.

మూలాలు

మార్చు
  1. జలవనరులు, సిద్దాని నాగభూషణం రచన, ఆరవ ముద్రణ (2004), పేజీ 27

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=డిండి_నది&oldid=4301893" నుండి వెలికితీశారు