డిటెక్టివ్ కార్తీక్
డిటెక్టివ్ కార్తీక్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. రీడింగ్ లాంప్ క్రియేషన్స్, వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి, పార్ధు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహించాడు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, అభిలాష్ బండారి, శృతి మోల్, అనూష నూతుల, హాసిని రాయ్, మదీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 14, 2023న విడుదల చేసి, సినిమా జూలై 21, 2023న విడుదలైంది[1][2][3][4]
డిటెక్టివ్ కార్తీక్ | |
---|---|
దర్శకత్వం | వెంకట్ నరేంద్ర |
రచన | వెంకట్ నరేంద్ర |
నిర్మాత | అశోక్ రెడ్డి, పార్ధు రెడ్డి |
తారాగణం | రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, అభిలాష్ బండారి, శృతి మోల్, అనూష నూతుల, హాసిని రాయ్, మదీ |
ఛాయాగ్రహణం | సిద్దం నరేష్ |
కూర్పు | కార్తిక్ కట్స్ |
సంగీతం | మార్కస్ ఎమ్ |
నిర్మాణ సంస్థలు | రీడింగ్ లాంప్ క్రియేషన్స్ , వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
పంపిణీదార్లు | వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 21 జులై 2023 |
సినిమా నిడివి | 115 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురిషిత అనే పదో తరగతి చదువుతున్న అమ్మాయి హత్యకు గురవుతుంది ఈ కేసును ఓ ప్రైవేటు డిటెక్టివ్ అయినా సంధ్య శృతి చంద్రన్ టేకప్ చేస్తుంది తన స్నేహితురాలు అయినా పల్లవితో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. అయితే ఓ రోజు సంధ్య కూడా కిడ్నాప్ కు గురవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న మరో ప్రైవేటు డిటెక్టివ్ కార్తీక్ రజాక్ రాఘవన్ సంధ్య మిస్సింగ్ కేస్ తో పాటు రిషిత మర్డర్ కేసును కూడా ఛేదించాలని అనుకుంటాడు. అసలు రిషిత అనే అమ్మాయిని హత్య చేసింది ఎవరు? సంజన కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ కేసులన్నీ విచారించే క్రమంలో కార్తీక్ ఎదురైన సవాళ్లు ఏంటి వీటన్నింటిని అధిగమించి సంధ్యా మిస్సింగ్ కేస్ తో పాట రిషిత హత్య కేసు ఎలా ఛేదించాడు అనేది కథ[5][6][7]
నటీనటులు
మార్చు- రజత్ రాఘవ్
- గోల్డీ నిస్సీ
- అభిలాష్ బండారి
- శృతి మోల్
- అనూష నూతుల
- హాసిని రాయ్
- మదీ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రీడింగ్ లాంప్ క్రియేషన్స్, వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: అశోక్ రెడ్డి, పార్ధు రెడ్డి[8]
- కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: వెంకట్ నరేంద్ర
- సంగీతం: మార్కస్ ఎమ్
విడుదల, స్పందన
మార్చునిర్మాత పార్ధు రెడ్డికు చెందిన వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ సిని నిర్మాణ సంస్థ నుండి ఈ సినిమా 2023 జూలై 21న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు యుఎస్ఏలో విడుదలయింది. ఈమధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏం లేదు. ఆ సరిహద్దులు ఎప్పుడో చెరిపేశారు ప్రేక్షకులు. అందుకే ఈమధ్య కథను నమ్ముకొని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. అలా కథను నమ్ముకొని వచ్చిన సినిమానే డిటెక్టివ్ కార్తీక్. కార్తీక్ పాత్రలో నటించిన రజత్ రాఘవ్ కు నటుడిగా అనుభవం ఉంది కాబట్టి చాలా ఈజ్ తోనే నటించుకుంటూ వెళ్లాడు. ఇక ఫీమేల్ లీడ్ లో నటించిన గోల్డీ నిస్సీ, శృతిమోల్, కార్తీక్ ఫ్రెండ్ పాత్రలో నటించిన హరి, నెగెటివ్ షేడ్ లో నటించిన భరత్ బండారీ వంటి ప్రధాన పాత్రధారుల నటన కూడా ఆకట్టుకుంది.
రేటింగ్
- 123తెలుగు.కామ్: 2.25/5
- సాక్షి: 2.5/5
- తెలుగు ఫిలిం నగర్ : 3/5[9]
- వెబ్ దునియా : 2.5/5
- AP To TS: 2.75/5
మూలాలు
మార్చు- ↑ "Detective Karthik: 'డిటెక్టివ్ కార్తీక్' మూవీ రివ్యూ". Sakshi. 2023-07-21. Retrieved 2023-07-23.
- ↑ "ఆకట్టుకుంటున్న డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్, ఈ నెల 21న సినిమా విడుదల". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-07-23.
- ↑ H, I. (2023-07-15). "ఆకట్టుకుంటున్న డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్, ఈ నెల 21న సినిమా విడుదల". IndustryHit.Com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-23.
- ↑ "డిటెక్టివ్ కార్తీక్.. ఈ నెల 21న విడుదల". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-23. Retrieved 2023-07-23.
- ↑ "Detective Karthik Movie Review: డిటెక్టివ్ కార్తీక్ మూవీ సమీక్ష". AP to TS (in ఇంగ్లీష్). 2023-07-21. Archived from the original on 2023-07-23. Retrieved 2023-07-23.
- ↑ "Detective Karthik Movie Review in Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-21. Retrieved 2023-07-23.
- ↑ డీవీ. "డిటెక్టివ్ కార్తీక్ ఎలా ఉందొ తెలుసా - రివ్యూ". telugu.webdunia.com. Retrieved 2023-07-23.
- ↑ Narendra, Venkat (2023-07-21), Detective Karthik (Crime, Mystery, Thriller), Rajath Raghav, Abhilash Bandari, Shruthi Mol, One Media Et, Reading Lamp Creations, retrieved 2023-07-23
- ↑ Pavani (2023-07-21). "డిటెక్టివ్ కార్తీక్ రివ్యూ - గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అలరించే థ్రిల్లర్". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-23.