డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం

(డి.ఎన్.ఏ నుండి దారిమార్పు చెందింది)

డి.ఎన్.ఎ. అంటే డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం ముఖ్యంగా క్రోమోసోముల్లో ఉంటుంది. మైటోకాండ్రియాలలో చాలా కొద్దిగా కనిపిస్తుంది. జీవులన్నింటిలో డి.ఎన్.ఎ. ముఖ్యమైన జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. జీవుల్లో అనువంశికానికి డి.ఎన్.ఎ. మూలాధారం.

ఎడమవైపు ఆర్.ఎన్.ఎ. కుడివైపు డి.ఎన్.ఎ. ల నిర్మాణం.

డి.ఎన్.ఎ. నిర్మాణం

మార్చు

వాట్సన్, క్రిక్ ల నమూనా ప్రకారం డి.ఎన్.ఎ. అణువు జంట పెన (డబుల్ హెలిక్స్, double helix) ఆకారంలో ఉంటుంది. దీనిలో రెండు పోచలు ప్రతి సమాంతరంగా అమరి ఉండి కుడివైపుకు మెలితిరిగి, అంతర బంధితమై ఉంటాయి. కుండలి వ్యాసం 20A0 వరకు ఉంటుంది, కాని డి.ఎన్.ఎ. అణువు పొడవు మాత్రం అనిశ్చితంగా ఉంటుంది. ఇది తన అక్షం చుట్టూ తాను సర్పిలంగా చుట్టుకొని క్రోమోసోమ్ బాహువులో ఇమిడి ఉంటుంది. మెలికలు లేకుండా సరిచేస్తే డి.ఎన్.ఎ. అణువు నిచ్చెన రూపంలో కనిపిస్తుంది.

డి.ఎన్.ఎ లో ప్రతి పొచ అనేక ఏపీ న్యుుకిలిటైడ్ ఎర్పాడిన పాలిమర్.

న్యుకిలిటైడ్ లో మూడు భాగాలు ఉంటాయి.

1) ఫాస్ఫేట్ సముదాయం.

2)డిఅక్స్కి ర్తేబోస్ చేక్కర.

3) నత్రజని షరలు.

నత్రజని షరలు 4గు రకాలు అవి:-1)అడిిినీన్

2)గ్యానిన్

3)స్తేటొసిన్

4)థైమిన్