డి.కె.చౌట

వ్యాపారవేత్త, రచయిత

దర్బే కృష్ణానంద చౌట (1938 జూన్ 1 - 2019 జూన్ 19)[1] భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. [2] అతను మరణించే నాటికి కర్ణాటక చిత్రకళా పరిషత్ [3][4] కు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. [5][6]

దర్బే కృష్ణానంద చౌట
జననం1 జూన్ 1938
మరణం19 జూన్ 2019 (aged 81)
బెంగళూరు, భారతదేశం
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం

వ్యక్తిగత జీవితం

మార్చు

డా. డి.కె.చౌట కేరళ రాష్ట్రం లోని మంజీశ్వర్ సమీపంలో గల దర్బే మీయప్పాడౌ గ్రామంలో జన్మించాడు. [2] అతనికి ఇద్దరు పిల్లలు. వారిలో సందీప్ చౌట సంగీతకారునిగా, ప్రజ్ఞా చౌట ఎత్నోగ్రాఫర్ గా ఉన్నారు. [7]

వృత్తి జీవితం

మార్చు

ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను అనేక సంవత్సరాలు ఘనా, నైజీరియా, లండన్ లలో జీవితాన్ని గడిపాడు. [2] తరువాత బెంగళూరు వచ్చి పరిశ్రమలు, ఎగుమతులు, కంట్రీ క్లబ్స్, వివిధ వ్యాపారాలను చేసి తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ఫలితంగా అతను ఎం/ఎస్ పవర్ గేర్ లిమిటెడ్, ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్, సన్ వాలీ క్లబ్ వంటి కంపెనీలను స్థాపించాడు. ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఐదుసార్లు ఎక్స్‌పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ చే అవార్డులు పొందింది. వ్యాపార కార్యక్రమాలతో పాటు అతను సమాజ సేవ కూడా చేసేవాడు.

సాహిత్యం

మార్చు

డా. చౌట "ఆనంద కృష్ణ" అనేకలం పేరుతో రచనలు చేసేవాడు. [2] అతని సాహితీ సేవలలో "కరియవజ్జెరెన కథెక్కులు", "ప్లిలిపతిగదసు" అనే నాటకాలకు కర్ణాటక ప్రభుత్వ తుళు సాహిత్య అకాడమీ పురస్కారాలు అందజేసింది. [8] అతని ఇతర రచనలలో పట్టు పజ్జెలు, డర్మెట్టిమాయె, యూరి ఉష్ణద మాయే, మిట్టబైలు యమునక్క" ముఖ్యమైనవి. [5] అతనికి మంగుళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. [5]

మూలాలు

మార్చు
  1. "Mangaluru: Veteran theatre personality, author Dr D K Chowta passes away". Archived from the original on 2019-06-21. Retrieved 2019-07-07.
  2. 2.0 2.1 2.2 2.3 Praveen Shivashankar (25 October 2013). "Keeping Tulu close to heart". No. Friday Review. The Hindu. Retrieved 14 December 2014.
  3. Muralidhar Khajane (24 April 2014). "Chitrakala Parishath set to revive leather puppetry". The Hindu. Retrieved 14 December 2014.
  4. "Executive Committee Members". Chitrakala Parishath. Archived from the original on 14 డిసెంబరు 2014. Retrieved 14 December 2014.
  5. 5.0 5.1 5.2 Special Correspondent (29 April 2011). "Honorary doctorate for Bannanje, D.K. Chowta, Ajai Kumar Singh". The Hindu. Archived from the original on 28 సెప్టెంబరు 2013. Retrieved 3 January 2012.
  6. Anuradha Vellat (29 January 2014). "A coffee book table on art". Deccan Herald. Bangalore. Retrieved 17 February 2014.
  7. Savitha Karthik, (28 October 2010). "May we have the trumpets please". Deccan Herald. Retrieved 3 January 2012.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  8. Staff Correspondent (19 March 2011). "Chowta, Shantharam get Tulu academy awards". The Hindu. Archived from the original on 12 ఏప్రిల్ 2011. Retrieved 3 January 2012.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=డి.కె.చౌట&oldid=4308328" నుండి వెలికితీశారు