డి లా ర్యూ (De La Rue, De La Rue plc - డి లా ర్యూ పిఎల్సి) అనేది ఒక బ్యాంకు నోటు తయారీ సంస్థ, భద్రతా ప్రింటింగ్, కాగితం తయారీ కొరకు బెసింగ్స్టోక్, హాంప్షైర్, ఇంగ్లాండ్లో ప్రధాన కార్యాలయం గల సంస్థ. ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో ఉంది.

చరిత్ర మార్చు

డి లా ర్యూ 1860 లో నోట్లను తయారు చేయడం ప్రారంభించింది, మొట్ట మొదటిగా మారిషస్ దేశానికి తరువాత ఇతర దేశాలలో తమ వ్యాపారాలను ఆరంభించి . ఈ రోజు ప్రపంచములో ప్రతి వారం తగినంత నోట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు ప్రధాన పోటీదారు, జర్మన్ కంపెనీ గీసేకే & డెవ్రియంట్, సుమారు 100 సెంట్రల్ బ్యాంకుల కోసం నోట్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది, కెనడియన్ బ్యాంక్ నోట్ కంపెనీ, అమెరికాలో ఉన్న క్రేన్ కరెన్సీ కంపెనీ కూడా కూడా ప్రధాన ఉత్పత్తి పోటీదారు. 2017 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన 171 బిలియన్ నోట్లలో సుమారు 11% వాణిజ్య ప్రింటర్లచే ముద్రించబడ్డాయి. డి లా ర్యూ ఈ సంస్థలలో అతిపెద్దది.[1] డి లా ర్యూ కంపెనీ ప్రామాణీకరణ విభాగం పన్నులు స్టాంపులు, సాఫ్ట్‌వేర్ సాంకేతిక లోపం ఏర్పడితే పరిష్కారాలు సూచించడం, ప్రమాణాలతో లేబుల్స్, రక్షణ డిజిటల్ పరిష్కారాలు, తనిఖీలు, బ్యాంక్ కార్డులు, పాలికార్బోనేట్‌తో సహా ID భద్రతా భాగాలు వంటి భౌతిక, డిజిటల్ ల సమస్యలు, లోపాలు సరిదిద్దడం వంటివి . ఈ సంస్థ కరెన్సీ విభాగం ప్రపంచంలోనే చెలామణిలో ఉన్న అన్ని నోట్లలో 1/3 వ భాగాన్ని డి లా రూ కంపెనీ రూపొందింది . ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, యుకెలకు ఈ కంపెనీ పూర్తి చేసిన నోట్ల యొక్క బ్యాంకులు, స్టేట్ ప్రింటింగ్ వర్క్స్, స్టేట్ పేపర్ మిల్లులు, ఇతర వాణిజ్య సంస్థలకు పాలిమర్ సబ్‌స్ట్రేట్ భద్రతా లక్షణాలను అందిస్తుంది.[2] సాంకేతికకు మార్పులాగా డి లా ర్యూ తమ కంపెనీ సేవలను డిజిటల్ వ్యాపారము ద్వారా కొనసాగిస్తున్నది.[3]

భారత దేశం లో సేవలు మార్చు

డి లా ర్యూ కంపెనీ 1876 నుండి భారతదేశంతో తన సేవలను అందించింది . 1962 లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో భారతదేశపు కరెన్సీ ముద్రణ (నోట్ పేపర్ మిల్లు ) నిర్మాణములో సహాయ పడింది.[4]

ఆదాయము మార్చు

డి లా ర్యూ కంపెనీ 2020 లెక్కల ప్రకారం చూస్తే, ఈ కంపెనీ సంవత్సర రెవెన్యూ $603.27 మిలియన్ల అమెరికన్ డాలర్లలో ఉంది.[5]

బ్యాంకు నోటులు

డి లా ర్యూ 150 పైగా జాతీయ కరెన్సీలకు అధిక భద్రతా కాగితం, ప్రింటింగ్ టెక్నాలజీ విక్రయిస్తుంది.[6]

మూలాలు మార్చు

  1. "UK banknote printer De La Rue fears for its future". bbc.com/news. 26 November 2019. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 15 February 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "De La Rue brings a culture of flexibility and a depth of experience to our long-term partnerships and new projects". delarue.com/. Archived from the original on 11 ఫిబ్రవరి 2021. Retrieved 13 February 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "DE LA RUE IDENTITY SYSTEMS" (PDF). securitydocumentworld.com/creo_files/upload/client_files/ids_corporate___general_brochure_new_size.pdf. Retrieved 15 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "De La Rue India". De La Rue India. Retrieved 15 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "DE LA RUE PLC". dnb.com/business-directory. Archived from the original on 19 అక్టోబరు 2021. Retrieved 17 February 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "About us". delarue.com. Archived from the original on 25 జూన్ 2014. Retrieved 28 March 2015.