డీమ్యాట్ ఖాతా
డీమాట్ ఖాతా అనేది ఆర్థిక సెక్యూరిటీలను (ఈక్విటీ లేదా ఋణం) ఎలక్ట్రానిక్ రూపంలో దాచి ఉంచే ఖాతా. డీమెటీరియలైజ్డ్ ఖాతాకు అది చిన్న పేరు. భారతదేశంలో, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనే రెండు డిపాజిటరీ సంస్థలు డిమాట్ ఖాతాలను నిర్వహిస్తాయి. బ్యాంకు వంటి డిపాజిటరీ పార్టిసిపెంట్లు పెట్టుబడిదారుడికి, డిపాజిటరీకి మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి.
లావాదేవీలను ఎలక్ట్రానిక్‌గా చక్కబెట్టుకోడానికి డిమాట్ ఖాతా సంఖ్యను ఉదహరించాలి. డీమెటీరియలైజ్డ్ ఖాతాను చూడాలంటే ఇంటర్నెట్ పాస్‌వర్డ్, లావాదేవీ పాస్‌వర్డ్ అవసరం. అప్పుడు సెక్యూరిటీల బదిలీలు కొనుగోళ్లను మొదలు పెట్టవచ్చు. లావాదేవీలు ధ్రువీకరించబడి, పూర్తయిన తర్వాత డీమెటీరియలైజ్డ్ ఖాతాలో సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలు వాటంతటవే జరిగిపోతాయి.
డీమాట్ వ్యవస్థ ప్రయోజనాలు
మార్చుఎలక్ట్రానిక్ నిల్వ కోసం భారతదేశం డిమాట్ ఖాతాను స్వీకరించింది. ఇందులో షేర్లు, ఇతర సెక్యూరిటీలను దాచి, ఎలక్ట్రానిక్‌గా నిర్వహిస్తారు. తద్వారా కాగితపు వాటాలతో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. 1996 డిపాజిటరీ చట్టం ద్వారా డిపాజిటరీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత, వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు, బదిలీల ప్రక్రియ గణనీయంగా సులభ తరమైపోయింది. కాగితపు ధ్రువపత్రాల వలన ఉండే చాలా నష్టాలు తగ్గిపోయాయి.
డీమాట్ ఖాతా వలన క్రింది ప్రయోజనాలు ఉన్నాయి:
- సెక్యూరిటీలను దాచుకునే సులభమైన, అనుకూలమైన మార్గం
- కాగితం-వాటాల కంటే సురక్షితమైనది (భౌతిక ధ్రువపత్రాలతో ముడిపడి ఉండే చెడ్డ డెలివరీ, నకిలీ సెక్యూరిటీలు, ఆలస్యం, దొంగతనాలు వంటి ప్రమాదాలు చాలావారకూ తొలగిపోతాయి)
- సెక్యూరిటీల బదిలీ కోసం కాగితాలపై రాత కోతల పని తగ్గిపోయింది
- లావాదేవీ ఖర్చు తగ్గిపోయింది
- "అడ్ లాట్" ల సమస్య పోయింది: ఇప్పుడు ఒక్క వాటానైనా అమ్ముకోవచ్చు
- డిపాజిటరీ పార్టిసిపెంట్ వద్ద నమోదైన చిరునామాలో చేసే మార్పు, పెట్టుబడిదారుడు సెక్యూరిటీలను కలిగి ఉన్న సంస్థలన్నిటి లోనూ నమోదైపోతుంది. వాటిలో ప్రతిదానితో విడివిడిగా మార్చాలసిన పనిలేదు.
- సెక్యూరిటీల మార్పిడి డిపాజిటరీ పార్టిసిపెంట్ చేస్తుంది. సంస్థలకు తెలియజేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
- బోనస్ / స్ప్లిట్, కన్సాలిడేషన్ / విలీనం మొదలైన వాటి నుండి ఉత్పన్నమయ్యే వాటాలు ఆటోమేటిగ్గా డిమాట్ ఖాతాలోకి చేరతాయి.
- ఈక్విటీ, ఋణం - ఈ రెండు పెట్టుబడులకూ ఒకే డిమాట్ ఖాతా వాడుకోవచ్చు
- వ్యాపారులు ఎక్కడి నుండైనా పని చేయవచ్చు (ఉదా. ఇంటి నుండి కూడా).
డీమాట్ లోటుపాట్లు
మార్చు- డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీలలో వ్యాపారంపై నియంత్రణ లేకుండా పోవచ్చు.
- డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీలలో వర్తకంపై నిశితంగా నిఘా పెట్టడం, ట్రేడింగ్ పెట్టుబడిదారులకు హాని కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మూలధన మార్కెట్ నియంత్రణా సంస్థపై ఉంది.
- డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీల విషయంలో, స్టాక్-బ్రోకర్ల వంటి కీలకమైన మార్కెట్ ప్లేయర్స్ పాత్రను జాగరూకతతో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి మార్కెట్‌ను తమకనుకూలంగా మెలిదిప్పగల సామర్థ్యం ఉంటుంది.
- డిపాజిటరీల చట్టం, రెగ్యులేషన్స్, వివిధ డిపాజిటరీల చట్టాలు బహుళ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లకు అనుగుణంగా ఉండాలి.
- డీమెటీరియలైజేషన్ ప్రక్రియలో వివిధ స్థాయిలలో ఒప్పందాలు చేసుకోవాలి. ఇవి సరళత కోరుకునే పెట్టుబడిదారుడికి ఆందోళన కలిగిస్తాయి.
- ద్రవ్య వాటాలను కలిగి ఉన్న డిమాట్ ఖాతాను మూసివేయడానికి వీలు లేదు. పెట్టుబడిదారుడు తన ఖాతాను మూసివేయలేడు. అతనూ, అతని వారసులూ వార్షిక ఫోలియో ఛార్జీలు కడుతూనే ఉండాలి
- చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు షేర్లను అమ్మేసిన తరువాత కూడా, తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఖాతాను మూసివేయరు. నిద్రాణమైన ఖాతాలపై కూడా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఛార్జీలు వసూలు చేస్తారని వారికి తెలియదు.
కోటి కొత్త డీమ్యాట్ ఖాతాలు
మార్చులైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరచుకున్నాయని, ఇపుడు మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లకు పైగా చేరిందని ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు.[1]
ఇవీ చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "LIC: ఎల్‌ఐసీ ఐపీఓ కోసం కోటి కొత్త డీమ్యాట్ ఖాతాలు". EENADU. Retrieved 2022-03-05.