డుర్రెస్ అల్బేనియాలో రెండవ అతిపెద్ద నగరం. ఆ దేశంలో ప్రధాన వ్యాపార కేంద్రం. ఈ నగరం పశ్చిమ అల్బేనియాలో ఉంది. అడ్రియాటిక్ సముద్రానికి ఆగ్నేయ మూలలో ఎర్జెన్, ఇషెమ్ నదుల ముఖద్వారాల మధ్య అల్బేనియన్ అడ్రియాటిక్ సముద్ర తీరం వెంబడి చదునైన మైదాన ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఈ నగరం అల్బేనియాలోకెల్లా పురాతన నగరం, ఇది క్రీస్తుపూర్వం 7వ శతాబ్దానికి చెందినది. ఈ నగరాన్ని కాలక్రమేణా ప్రాచీన గ్రీకులు, రోమన్లు, మధ్య యుగంలో బైజాంటైన్‌లు, తరువాతి ఒట్టోమన్‌లు పరిపాలించారు.

డుర్రెస్ [Durrës]
Flag of డుర్రెస్ [Durrës]
Population
1,75,110[1]
Websitedurres.gov.al

బీచ్ రిసార్ట్‌లు, వ్యాపార కేంద్రాలు, పాత చారిత్రక ప్రదేశాలు కలిగిన డుర్రెస్ నేడు అల్బేనియాలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఆర్థిక రంగంలో డుర్రెస్ పోర్ట్, బీచ్ రిసార్ట్‌లు, హోటళ్లు, అనేక ఇతర పారిశ్రమలు ఈ నగరానికి ఆర్థిక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి.

మూలాలు మార్చు

  1. "Durrës - Porta Vendore". Porta Vendore. Retrieved 30 March 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=డుర్రెస్&oldid=4174917" నుండి వెలికితీశారు