డైనమైట్ అనగా ఉష్ణవాహక పొడి (Diatomaceous earth) లేదా పొడి గుండ్లు, మట్టి, సాడస్ట్, లేదా కలప గుజ్జు వంటి ఇతర ఇంకించుకొనే పదార్ధాలను ఉపయోగించుకొని పనిచేసే నైట్రోగ్లిజరిన్ ఆధారిత పేలుడు పదార్థం. తక్కువ స్థిరత్వమున్న సాడస్ట్ వంటి సేంద్రీయ పదార్థాలను డైనమైట్లకు ఉపయోగిస్తారు, సాధారణ ఉపయోగం నిలిపివేయబడింది. డైనమైట్ ను జర్మనీ లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నారు, 1867 లో పేటెంట్ పొందాడు. దీని పేరు "పవర్" అనే అర్థానిచ్చే, డైనమిస్ δύναμις అనే పురాతన గ్రీకు పదం నుండి నోబెల్ రూపొందించాడు. [1][2]

డైనమైట్ యొక్క రేఖాచిత్రం.
  1. నైట్రోగ్లిజరిన్ లో నానబెట్టిన రంపపుపొట్టు (లేదా ఇంకే పదార్థం యొక్క ఏదైనా ఇతర రకం)
  2. పేలుడు పదార్థం చుట్టూ రక్షణ పూత.
  3. బ్లాస్టింగ్ క్యాప్.
  4. బ్లాస్టింగ్ క్యాప్‌కు అనుసంధానించబడిన ఎలక్ట్రికల్ కేబుల్ (లేదా ఫ్యూజ్).
1942లో డగ్లస్ ఆనకట్ట నిర్మాణ సమయంలో డైనమైట్ ను సిద్ధం చేస్తున్న చిత్రం.

డైనమైట్ అధిక పేలుడు పదార్థం, అనగా తటాలునమండుట కంటే పేలిపోవుట నుండి అధిక శక్తి వెలువడుతుంది. డైనమైట్ ను ప్రధానంగా మైనింగ్, క్వారీ, నిర్మాణం, కూల్చివేత పరిశ్రమలలో ఉపయోగిస్తారు, కొన్ని చారిత్రక యుద్ధాలలోనూ వాడడం జరిగింది.

మూలాలుసవరించు

  1. "dynamite." The American Heritage® Dictionary of the English Language, Fourth Edition. 2003. Houghton Mifflin Company 19 March 2013 http://www.thefreedictionary.com/dynamite
  2. "dynamite." Collins English Dictionary – Complete and Unabridged. 1991, 1994, 1998, 2000, 2003. HarperCollins Publishers 19 March 2013 http://www.thefreedictionary.com/dynamite
"https://te.wikipedia.org/w/index.php?title=డైనమైట్&oldid=2880989" నుండి వెలికితీశారు