డొరొతీ లారెన్స్

డొరొతీ లారెన్స్ (4 అక్టోబరు 1896 – అక్టోబరు 1964) ఆంగ్ల విలేఖరి, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రహస్యంగా మగవేషంలో బ్రిటీష్ సైన్యంలో చేరారు.[1][2][3] ఫ్రీలాన్స్ యుద్ధ కరెస్పాండెంట్ గా ఫ్రెంచ్ సెక్టర్  నుంచి యుద్ధ జోన్ లోకి చేరేందుకు ప్రయత్నించిన ఆమెను ఫ్రెంచ్  పోలీసులు అరెస్ట్ చేసి, ఊరి అవతల దించేశారు. దానికి ప్రతీకారంగా  బ్రిటీష్ సైన్యంలో చేరి, గొప్ప సాహసం చేశారు డొరొతీ. 

తొలినాళ్ళ జీవితం మార్చు

మిడిల్‌సెక్స్లోని హెండన్ ప్రాంతంలో పుట్టారు డొరొతి.[1][4] ఆమె తల్లిదండ్రుల వివరాలు లేవు. డొరొతి అక్రమ సంతానం అని కొందరి వాదన. డొరొతి చిన్న వయసులోనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు దత్తత బిడ్డగా పెరిగారు.[2]

ఆమె తల్లిదండ్రుల విషయంలో కొంత వివాదం ఉంది. 2004లో ప్రచురితమైన ది ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ ప్రకారం డొరొతీ 4 అక్టోబర్ 1896న పోల్స్ వర్త్, వార్విక్ షైర్ లో జన్మించారు. థామస్ హార్ట్ షార్న్ లారెన్స్, మేరీ జేన్ బెడ్డల్ ల రెండో కుమార్తె అని రాశారు ఆ పుస్తకంలో.

యుద్ధ కరెస్పాండెంట్ మార్చు

విలేఖరి అవ్వాలని ఆమె చిన్నప్పట్నుంచీ కోరుకునేది. ది టైమ్స్ పత్రిక కు ఆమె కొన్ని వ్యాసాలు రాసి పంపించారు. అవి ప్రచురితమయ్యాయి కూడా.[2] యుద్ధం మొదలైన తరువాత ఫ్లీట్ స్ట్రీట్ లో ఉన్న ఎన్నో వార్తా పత్రికలకు యుద్ధ విశేషాలను వార్తలు రాసి పంపేవారు.

రూపాం మార్పు మార్చు

 
బ్రిటిష్ సైన్యంలో మారు వేషంలో చేరిన డొరొతి లారెన్స్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; TimeSer అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; DMail2537793 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Alison Fell (27 October 2014). "Viewpoint: Why are so few WW1 heroines remembered?". BBC News. Retrieved 27 October 2014.
  4. "Dorothy Lawrence". School Net. Retrieved 12 January 2014.