డౌన్‌లోడ్
డౌన్లోడ్ అనగా మరొక కంప్యూటర్ లేదా సర్వర్ నుండి సమాచారాన్ని పొందడం. డౌన్‌లోడింగ్ యొక్క సరసన అప్‌లోడింగ్ ఉంటుంది, ఇది మరొక కంప్యూటర్ కు డేటా పంపుతుంది. సాధారణంగా ఒక వెబ్ పేజీ కోసం "డౌన్లోడ్" అని మనం చెప్పలేము (ఉదాహరణకు మీరు మీ కంప్యూటర్ లో ఈ పేజీ తెరవడాన్ని). సాధారణంగా డౌన్‌లోడింగ్ అనే దానిని మనం ఏదో పెద్ద కంప్యూటర్ ఫైల్, లేదా డేటా లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాము దిగుమతి చేసుకున్నప్పుడే అంటుంటాము. డౌన్లోడబుల్ పద అర్థం ఎవరయినా తన సొంతం కోసం ఉపయోగించుకోవడానికి నిల్వచేయుటకు పొందే సమాచారము లేదా డేటా. యూజర్ డౌన్లోడ్ చేసుకున్న సమాచారాన్ని లేదా డేటా ను ఆ డౌన్‌లోన్ యొక్క ఒప్పందపు నోటీసు ఆధారంగా ఉపయోగించుకోవచ్చు. చట్టబద్ధమైనవి లేదా కానటువంటి ఫైళ్ళను లేదా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం 21 వ శతాబ్దంలో చాలా సులభమయింది.
అన్‌లైన్‌లో ఫైళ్ళ డౌన్‌లోడింగ్ సమయం ఇంటర్నెట్, ఆ వెబ్ సైట్ యొక్క వేగం పై, కంప్యూటర్ సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని డౌన్‌లోడులను ఒకే దపాగా ఇంటర్నెట్ లో ఎటువంటి అంతరాయం కలగకుండా డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది, మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయినట్లయితే మళ్ళీ మొదట నుంచి ఆ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.