డ్రూ వెయిస్ మన్
కోవిడ్ - 19 మహమ్మారిపై పోరు కోసం సమర్థవంతమైన ఎం ఆర్ ఎన్ ఏ టీకాల అభివృద్ధికి మార్గాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డ్రూ వెయిస్ మన్ కు 2023 సంవత్సరం వైద్యశాస్త్రంలో నోబుల్ పురస్కారం లభించింది.[1] కరోనా వైరస్ కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరి పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది.[2]
డ్రూ వెయిస్‌మన్ నేపథ్యం
మార్చువెయిస్మన్ 1959లో మస్సాచుసెట్ట్‌స్‌లోని లెక్జింగ్‌టన్‌లో జన్మించారు. 1989లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎండీ, పిహెచ్‌డీ పట్టాలను అందుకున్నారు.[3] హార్వార్డ్ మెడికల్ స్కూల్‌లోని బేత్ ఇజ్రాయెల్ డెకొనెస్ మెడికల్ సెంటర్ వద్ద క్లినికల్ ట్రైనింగ్ చేశారు.[4] నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ వద్ద పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. 1997లో పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్ మెన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో తన పరిశోధక బృందాన్ని వెయిస్‌మన్ నెలకొల్పారు.[5]
ఎన్‌ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై ఔషధ తయారీ రంగం ఆసక్తి 2010లో ఊపందుకోవడం మొదలైంది. పలు కంపెనీలు ఆ విధానాన్ని అభివృద్ధి చేయడంపై కసరత్తు ప్రారంభించాయి. జైకా వైరస్, ఎంయీఆర్‌ఎస్-సీవోవీలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. రెండవ వైరస్ ఎస్‌ఏఆర్‌స్-సీవోవీ-2 వైరస్‌కు అత్యంత సన్నిహితమైంది. 2020 మొదట్లో కొవిడ్-19 మహమ్మారి యావత్ మానవాళిని చుట్టుముట్టడంతో ఎస్‌ఏఆర్‌స్-సీవోవీ-2 ప్రొటీన్ గుట్టు రట్టు చేస్తూ మూలంలో మార్పులతో కూడిన రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను రికార్డు స్థాయి వేగంతో అభివృద్ధి చేశారు. అదే డిసెంబర్ మొదట్లో రెండు వ్యాక్సిన్లకు ఆమోదం లభించింది.
మూలాలు :
- ↑ "కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కర్తలకు నోబెల్.. శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు అత్యున్నత పురస్కారం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-02. Retrieved 2023-10-06.
- ↑ telugu, NT News (2023-10-03). "Nobel Prize | కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్". www.ntnews.com. Retrieved 2023-10-06.
- ↑ "Nobel Prize: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలకే!". Samayam Telugu. Retrieved 2023-10-06.
- ↑ "టీకా యోధులకు నోబెల్". EENADU. Retrieved 2023-10-06.
- ↑ Desk 19, Disha Web (2023-10-02). "వైద్య రంగ నోబెల్ అవార్డులు ప్రకటన.. ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం". www.dishadaily.com. Retrieved 2023-10-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)