తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల)

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం

తంగళ్ళపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. తంగళ్ళపల్లి, ఈ మండలానికి కేంద్రం.

తంగళ్ళపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం తంగళ్ళపల్లి (సిరిసిల్ల)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 189 km² (73 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 50,675
 - పురుషులు 25,125
 - స్త్రీలు 25,550
పిన్‌కోడ్ 505405

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ తంగళ్లపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోని సిరిసిల్ల మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా తంగళ్లపల్లి గ్రామాన్ని (1+15) పదహారు గ్రామాలుతో నూతన మండల కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3] ఈ మండల వైశాల్యం 189 చ.కి.మీ. కాగా, జనాభా 50,675. జనాభాలో పురుషులు 25,125 కాగా, స్త్రీల సంఖ్య 25,550. మండలంలో 12,761 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. తంగళ్ళపల్లి
  2. చింతల్‌ఠానా
  3. చీర్లవంచ
  4. తాడూర్
  5. మండేపల్లి
  6. ఓబులాపూర్ (పికె)
  7. కస్బికట్కూర్
  8. వేణుగోపాల్‌పూర్
  9. గండిలచ్చపేట
  10. జిల్లేళ్ల
  11. సారంపల్లి
  12. బద్దెనపల్లి
  13. బస్వాపూర్
  14. నేరెళ్ల
  15. రామచంద్రాపూర్
  16. నర్సింహులపల్లి

మూలాలు మార్చు

  1. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు