తంగుడు కృష్ణారావు
తంగుడు కృష్ణారావు శ్రీకాకుళం జిల్లాకి చెందిన గాయకుడు . చిన్ననాటి నుండి పాటే ఆయనకు ప్రాణము . అంచెలంచెలుగా పాటల పల్లకి పై ఆయన ఎదిగారు . మధురమైన తన కంఠస్వరముతో ముగ్ధులను చేస్తున్నారు . మారుమూల గ్రామానికి చెందిన మణిపూస ... రాష్ట్ర స్థాయిలో ప్రముఖుల మన్ననలను అందుకుంటున్నారు .
జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన తంగుడు కృష్ణారావు బి.యస్సీ.వరకు చదువుకున్నారు . నరసన్నపేటలో చదువు కొనసాగించారు . చిరుప్రాయము నుంచి పాటే ప్రాణముగా తరగతి గదుల్లో చిన్నచిన్న స్వరాలతో తనలోని నైపుణ్యాన్ని క్రమముగా మెరుగుపరచుకొని ప్రస్తుతం ప్రముఖ నేపథ్యగాయకుల నడుమ తన పాటల ప్రయాణము సాగిస్తున్నారు . రాష్ట్ర, దేశ వ్యాప్తముగా తన ప్రదర్శనలు ఇచ్చి పరువురి ప్రశంసలు అందుకుంటున్నారు . ఇటీవల కృష్ణారావుకు కోటబొమ్మాళికి చెందిన సౌజన్యతో వివాహము జరిగింది. ఆమెకు కూడా పాటలంటే ఎనలేని మక్కువ .
ప్రముఖులతో కృష్ణారావు :
మార్చు- ప్రముఖ సినీనేపథ్య గాయకులు బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ, జి.ఆనంద్, సునీత, వాసూరావు తదితరుల సంగీత దర్శకత్వములో సినీ పా్టలు పాడి మన్ననలు అందుకుంటున్నారు . ఇప్పటివరకు టి.వి.సీరియల్ లోనూ, పలు సినిమాల్లోనూ కృష్ణారావు పాటలు పాడారు .
- టి.వి.సీరియల్ :
- జీవన జ్యోతి టైటిల్ సాంగ్,,
- రాగాల పల్లకి,
- కాలేజ్ డేట్ టు మేరేజ్ డేట్,
- యువల గీతం ............ మున్నగునవి .
తన ప్రతిభను స్పృత్యంజలి పరిషత్, తిరుపతిలో జాతీయ స్థాయి కళాకారుల నడుమ నిర్వహించిన నాథనీరాజనం కార్యక్రమములో తన ప్రతిభను చూపారు . పుట్టపర్తి సత్యసాయి సన్నిధిలో కూడా కృష్ణారావు తన గాత్రాన్ని వినిపించారు . బండారు చిట్టిబాబు వద్ద తన సంగీత అనుభాన్ని సాధించుకొని పలువురి మన్ననలు పొందారు . సప్తస్వరాలు, పాడుతాతీయగా, రాగాల పల్లకి వంటి పోటీల్లో మేటిగా నిలిచిన కృష్ణారావు తాజాగా పలు సినీగేయాలను అలపిస్తున్నారు .
కృష్ణారావు వంశీయులు :
మార్చుతన తాత తంగుడు సత్యనారాయణ కూడా కళాకారుడే ... ఆయన రంగస్థల నటుడుగా పేరుతెచ్చుకున్నారు . అనంతరము తన తండ్రి రామం .. చంద్రమతి, నక్షత్రక తదితర పాత్రలను వేసి రక్తికట్టింఛేవారు . ఇప్పుడు కృష్ణారావు పాటలతో ఆకట్టుకుంటున్నారు .