తత్పురుష సమాసము

ఉత్తర పదార్ధము ప్రధానముగా గలది తత్పురుష సమాసము. రామ బాణము - ఇందు పూర్వపదము రామ - ఉత్తరపదము బాణము. రామ బాణముతో చంపెను. అనగా ఇందు బాణము ప్రధానము. క్రియతో సంబంధము కలిగియుండును. మొదటి ​పదము లోపించిన విభక్తి పేరు సమాసమునకు వచ్చును. ఇది వ్యధి కరణ సమాసము. లోపించిన విభక్తిని చేర్చి చెప్పుట విగ్రహ వాక్యము.[1]

ఉదాహరణలు

మార్చు
సమాసము విగ్రహవాక్యము సమాసనామము తత్పురుష సమాస రకం
1 అర్ధ రాజ్యము రాజ్యము యొక్క అర్ధభాగము ప్రధమా తత్పురుష సమాసము
కడతల తల యొక్క కడ భాగము
2 కృష్ణ శ్రితుడు కృష్ణుని ఆశ్రయించిన వాడు ద్వితీయా తత్పురుష సమాసము
నెలతాల్పు నెలను ధరించిన వాడు
3 గుణహీనుడు గుణము చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసము
నెల తక్కువ వాడు నెలచేత తక్కువ వాడు
4 పూజా పూజ కొఱకు చతుర్దీతత్పురుష సమాసము
గృహము దేవర మేలు గృహము దేవర కొఱకు మేలు.
5 ప్రాణాధికుడు ప్రాణముకంటె అధికుడు పంచమీతత్పురుష సమాసము
దొంగ భయము దొంగ వలన భయము
6 రాజభటుడు రాజుయొక్క భటుడు షష్ఠీ తత్పురుష సమాసము
చెట్టు కొమ్మ చెట్టు యొక్క కొమ్మ
7 గృహకృత్యములు గృహమందలి కృత్యములు సప్తమీ తత్పురుష సమాసము
మాటనేర్పరి మాటయందు నేర్పరి
8 అజ్ఞానము జ్ఞానము లేనిది నఙ్ఞ్ తత్పురుష సమాసము
అసత్యము సత్యము కానిది

మూలాలు

మార్చు
  1. ఆలీ, షేక్. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సమాస విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-05-11.