తబస్సుమ్ గోవిల్
తబస్సుమ్ (జననం కిరణ్ బాలా సచ్‌దేవ్; 1944 జూలై 9 - 2022 నవంబరు 18) ఒక భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. ఆమె 1947లో బాలనటి బేబీ తబస్సుమ్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు మొదలైన తొలినాళ్లలో హోస్ట్‌గా టెలివిజన్ కెరీర్‌ను ఎంచుకుంది. దూరదర్శన్‌లో ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ టాక్ షో ద్వారా ఆమె సినిమా, టీవీ ప్రముఖులను 1972 నుండి 1993 వరకు ఇంటర్వ్యూ చేసింది.
తబస్సుమ్ గోవిల్ | |
---|---|
జననం | కిరణ్ బాల సచ్‌దేవ్ 1944 జూలై 9 |
మరణం | 2022 నవంబరు 18 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 78)
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | బేబీ తబస్సుమ్ |
వృత్తి | నటి, టాక్ షో హోస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1947–2022 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ (టీవీ సిరీస్) (1972–1993) |
జీవిత భాగస్వామి | విజయ్ గోవిల్ |
బంధువులు | అరుణ్ గోవిల్ (మరిది) |
జననం
మార్చుతబస్సుమ్ 1944లో ముంబైలో భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అయోధ్యనాథ్ సచ్‌దేవ్, స్వాతంత్ర్య సమరయోధురాలు, పాత్రికేయురాలు, రచయిత్రి అయిన అస్ఘరీ బేగం దంపతులకు జన్మించింది. ఆమెకు తండ్రి తబస్సుమ్ అని, తల్లి కిరణ్ బాలా అని నామకరణం చేసారు. వివాహానికి ముందు ఉన్న పత్రాల ప్రకారం ఆమె అధికారిక పేరు కిరణ్ బాలా సచ్‌దేవ్ గా ఉంది.[1]
కెరీర్
మార్చునర్గీస్ (1947), మేరా సుహాగ్ (1947), మంఝ్‌ధార్ (1947), బారీ బెహెన్ (1949) చిత్రాలతో తబస్సుమ్ బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత నితిన్ బోస్ దర్శకత్వం వహించిన దీదార్ (1951)లో ఆమె చిన్ననాటి నర్గీస్ పాత్రను పోషించింది. లతా మంగేష్కర్, షంషాద్ బేగం పాడిన బచ్‌పన్ కే దిన్ భూలా నా దేనా అనే హిట్ పాట ఆమెపై చిత్రీకరించబడింది.[2]
మరుసటి సంవత్సరం ఆమె విజయ్ భట్ దర్శకత్వం వహించిన బైజు బావ్రా (1952)లో నటించింది. ఇందులో ఆమె మీనా కుమారి చిన్ననాటి పాత్రలో కనిపించింది. ఆమె జాయ్ ముఖర్జీ, ఆశా పరేఖ్ నటించిన ప్రసిద్ధ చిత్రం ఫిర్ వోహీ దిల్ లయా హూన్‌లో కూడా పనిచేసింది. కొంత గ్యాప్ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.[3]
తబస్సుమ్ భారతీయ టెలివిజన్ మొదటి టాక్ షో ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్‌ను హోస్ట్ చేసింది, ఇది 1972 నుండి 1993 వరకు 21 సంవత్సరాలు నడిచింది. దూరదర్శన్ కేంద్రం ముంబై ద్వారా నిర్మించబడింది. ఇది చలనచిత్ర ప్రముఖుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించబడింది. దీంతో చక్కని ప్రజాదరణ పొందింది.[2][4] ఆమె 15 సంవత్సరాల పాటు గృహలక్ష్మి అనే హిందీ మహిళా పత్రికకు సంపాదకురాలిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆమె అనేక జోక్ పుస్తకాలు రాశారు.[5]
ఆమె 1985లో స్వీయరచన, దర్శకత్వంలో తన మొదటి చిత్రం తుమ్ పర్ హమ్ ఖుర్బాన్ నిర్మించింది.[5] 2006లో రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్యార్ కే దో నామ్: ఏక్ రాధా, ఏక్ శ్యామ్‌లో నటిగా ఆమె టెలివిజన్‌కి తిరిగి వచ్చింది.[2] జీ టీవీలో రియాలిటీ స్టాండ్-అప్ కామెడీ షో లేడీస్ స్పెషల్ (2009)లో ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.[3]
టీవీ ఆసియా USA, కెనడా టెలివిజన్ ల కోసం తబస్సుమ్ ఇంటర్వ్యూయర్‌గా పనిచేస్తూనే ఆమె యూట్యూబ్‌లో "తబస్సుమ్ టాకీస్" పేరుతో తన స్వంత ఛానెల్‌ని ప్రారంభించింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చుటెలివిజన్ నటుడు అరుణ్ గోవిల్ అన్నయ్య విజయ్ గోవిల్‌ను తబస్సుమ్ వివాహం చేసుకుంది. వారి కుమారుడు హోషాంగ్ గోవిల్ కూడా నటుడే. ఆయన తబస్సుమ్ నిర్మించి దర్శకత్వం వహించిన తుమ్ పర్ హమ్ ఖుర్బాన్ (1985)లో కథానాయకుడిగా నటించాడు. ఇందులో జానీ లీవర్‌ని మొదటిసారి హాస్యనటుడిగా ఆమె తెరపైకి పరిచయం చేయడం విశేషం. అలాగే ఆయన మరో రెండు చిత్రాలు కార్టూట్ (1987), అజీబ్ దస్తాన్ హై యా (1996)లలో కూడా నటించాడు. ఆయన కూతురు ఖుషి 2009లో హమ్ ఫిర్ మిలే నా మిలేతో తన సినీ రంగ ప్రవేశం చేసింది.[7]
మరణం
మార్చుగుండెపోటుకు గురైన 78 సంవత్సరాల తబస్సుమ్ గోవిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022 నవంబరు 18న తుదిశ్వాస విడిచింది.[8]
మూలాలు
మార్చు- ↑ "Nargis, Meena Kumari, Madhubala, Suraiya... they all loved me". Rediff.com. Retrieved 1 November 2014.
- ↑ 2.0 2.1 2.2 Sangeeta Barooah Pisharoty (21 April 2006). "The darling of all". The Hindu. Archived from the original on 25 May 2006. Retrieved 28 June 2013.
- ↑ 3.0 3.1 "Want a golden belan?". DNA India. 23 June 2009. Retrieved 28 June 2013.
In her late 60s, ...
- ↑ Conjugations: Marriage and Form in New Bollywood Cinema, Sangita Gopal, pp. 3, University of Chicago Press, 2012, ISBN 9780226304274, "... Further, Hindi film became far more integrated with other forms of media – as exemplified by the proliferation of film magazines such as Filmfare, Stardust, and Cine Blaze, as well as the phenomenal popularity of television shows such as Chitrahaar and Phool Khile Hain Gulshan Gulshan..."
- ↑ 5.0 5.1 "Lost and found: Thirty newsmakers from the pages of Indian history and where they are now: Cover Story". India Today. 3 July 2006. Retrieved 16 December 2013.
- ↑ "From Doordarshan to YouTube: Actor Tabassum on keeping up with the times". Hindustan Times (in ఇంగ్లీష్). 18 February 2016. Retrieved 13 July 2020.
- ↑ "Tabassum's granddaughter in B'wood". The Times of India. 18 June 2009. Archived from the original on 16 December 2013. Retrieved 28 June 2013.
- ↑ "Veteran actor Tabassum dies due to cardiac arrest". Dev Discourse. 19 November 2022. Retrieved 19 November 2022.