తరువాత ఎవరు, 2018 ఆగస్టు 3న విడుదలైన తెలుగు సినిమా.[1] హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ బ్యానరులో లక్ష్మీరెడ్డి, రాజేష్ కోడూరు నిర్మించిన ఈ సినిమాకు జి. కృష్ణప్రసాద్, కె. రాజేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ కామరాజు, మనోజ్, ప్రియాంక శర్మ తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు.[2][3]

తరువాత ఎవరు
తరువాత ఎవరు సినిమా పోస్టర్
దర్శకత్వంజి. కృష్ణప్రసాద్, కె. రాజేష్ రెడ్డి
రచనజి. కృష్ణప్రసాద్, కె. రాజేష్ రెడ్డి (కథ)
చిట్టిశర్మ (మాటలు)
నిర్మాతలక్ష్మీరెడ్డి, రాజేష్ కోడూరు
తారాగణంకమల్ కామరాజు
మనోజ్
ప్రియాంక శర్మ
ఛాయాగ్రహణంరాజేంద్ర కేసని
కూర్పుఆవుల వెంకట్
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్
విడుదల తేదీ
2018 ఆగస్టు 3
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా సారాశం సవరించు

చందు (మనోజ్), నిత్య (ప్రియాంక శర్మ) ప్రేమించుకుంటారు. ఒక చిన్న సమస్య కారణంగా విడిపోతారు. నిత్య తన స్నేహితులతో కలిసి రియాలిటీ షోలో పాల్గొనాలని అనుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న చందు కూడా ఈ షోలో పాల్గొంటాడు. అయితే, అందులో పోటిచేసిన వారు ఒకరి తరువాత ఒకరు చంపబడుతుంటారు. వారు అలా ఎందుకు చంపబడుతారు, చందు నిత్యను ఎలా కాపాడుతాడు అన్నది మిగతా కథ.

నటవర్గం సవరించు

 • కమల్ కామరాజు
 • భరణి
 • మనోజ్
 • ప్రియాంక శర్మ
 • ప్రశాంత్ నీల్
 • సాయికిరణ్
 • సురేష్
 • మధన్
 • అమర్
 • కరుణాకర్
 • రాధిక
 • జ్యోతి
 • సంతోష్

పాటలు సవరించు

ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[4] లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

 1. హలో బేబీ (రచన: కరుణాకర్ అడిగర్ల, గానం: వేదాల హేమచంద్ర)
 2. వినదే వినదే (రచన: కరుణాకర్ అడిగర్ల, గానం: డింకర్ కల్వల, హరిణి)
 3. నిన్నని (రచన: గొల్లకోట రామకృష్ణ, గానం: విజయ్ కురాకుల)
 4. వినదే వినదే (రిపీట్)
 5. హలో బేబీ (వాయిద్యం)

మూలాలు సవరించు

 1. "Taruvata Evaru 2018 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Tharuvatha Evaru Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2018-08-03. Retrieved 2021-07-25.
 3. "Taruvata Evaru? Movie Review (018 ) - Rating, Cast & Crew With Synopsis". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
 4. "Taruvata Evaru 2018 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు సవరించు