తలారి వెంకట్రావు

తలారి వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

తలారి వెంకట్రావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు ముప్పిడి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1966
దేవరపల్లి , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పరంజ్యోతి
సంతానం ముగ్గురు కుమార్తెలు

జననం, విద్యాభాస్యం మార్చు

తలారి వెంకట్రావు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి లో జన్మించాడు. ఆయన 1996లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

తలారి వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌గా, భారత టెలికాం బోర్డు సభ్యుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా పని చేశాడు. ఆయన 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను ఆశించిన కొన్ని కారణాల వాళ్ళ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[1] తలారి వెంకట్రావు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పై 37,461 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  2. Sakshi. "Gopalapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.