తలుపులమ్మ లోవ

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, తుని మండలం, లోవ కొత్తూరు దగ్గర గల హిందూ దేవాలయం

తలుపులమ్మ లోవ కాకినాడ జిల్లా, తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. [1][2]తునికి 5 కి.మీ దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇక్కడగల తలుపులమ్మ దేవాలయం, వృక్షసంపద కారణంగా ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

తలుపలమ్మ లోవ ఆలయం
తలుపులమ్మ ఆలయం
తలుపులమ్మ ఆలయం
తలుపులమ్మ లోవ is located in Andhra Pradesh
తలుపులమ్మ లోవ
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°22′26″N 82°29′44″E / 17.3739°N 82.4955°E / 17.3739; 82.4955
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
స్థలంలోవ,
సంస్కృతి
దైవంతలుపలమ్మ తల్లి
ముఖ్యమైన పర్వాలువార్షిక జాతర
ఆషాడ మాస ఉత్సవాలు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ శిల్పశైలి
పటం
తలుపలమ్మ దేవాలయం OSM పటం

రవాణా సౌకర్యాలు మార్చు

తుని నుండి సమీప గ్రామం లోవకొత్తూరు వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.

తలుపులమ్మ దేవాలయం మార్చు

 
తలుపులమ్మ లోవ ఆలయం వద్ద శివుని విగ్రహం

అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ మార్చు

కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Sacred and Protected Groves of Andhra Pradesh (in ఇంగ్లీష్). World Wide Fund for Nature--India, A.P. State Office. 1996.
  2. Hemingway, F. R. (2000). Godavari District Gazetteer (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-1461-1.


వెలుపలి లంకెలు మార్చు