తామరపల్లి తిమ్మయ్య

తామరపల్లి తిమ్మయ్య ఒక ప్రాచీన తెలుగు కవి. అతను నియోగి బ్రాహ్మణుడు[1]. ఆపస్తంబ సూత్రుడు. భార్గవ గోత్రానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులు నాగమాంబ, శరణుమంత్రి. అతను చంద్రమంత్రికి పౌత్రుడు. వల్గూరు జగ్గయామాత్యునకు గొండమకును దౌహిత్రుడు.

ఇతడు "శేషధర్మము" అను ఐదు అశ్వాసములు కల పద్యకావ్యమును రచించెను. దీనిని ధర్మయామాత్యుని ప్రేరణతో శ్రీరామునికంకితమిచ్చెను. ఇతను తన వంశమును, తన తల్లి వంశమును గూర్చి పద్యముల ద్వారా కావ్యమునందు వివరించెను. [2]

శేషధర్మము

మార్చు

ఈ కావ్యమును శ్రీరామునికి అంకితమిచ్చెను. ఈ కావ్యములోని ఒక పద్యము :

ఉ. తోడికులాంగన ల్మణులతో గనకంబులతోడ వెండితో
వాడలవాడలన్ సిరికి వన్నెలు వెట్టుచు నాథపుత్రులం
గూడి సుఖింపగా మనము కూటికి గూరకు జిక్కి బిడ్డల
ల్లాడగ నెల్లకాలము మహాత్మ కనుంగొనుచుండ శక్యమే.

మూలాలు

మార్చు
  1. ఆంధ్ర కవుల చరిత్రము, కందుకూరి వీరేశలింగము, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2005.
  2. "పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/187 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-07-07. Retrieved 2020-07-05.