తాలాంక నందినీ పరిణయము

తాలాంక నందినీ పరిణయము ఒక తెలుగు కావ్యం. దీనిని మరింగంటి కవులలో ఒకరైన ఆసూరి మఱింగంటి వేంకట నరసింహాచార్యులు రచించారు. దీనిని తొలిసారిగా 1980 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురించింది. ఈ కావ్యానికి శ్రీరంగాచార్య సంపాదకత్వం వహించి విపులమైన పీఠికను అందించారు.

కవి పరిచయంసవరించు

ఈ కవి మరిగంటి వంశానికి చెందినవాడు. ఇతను చరమదశ వరకు కనగల్లులోనే నివసించాడు. అన్నగారి పుత్రుని పుత్ర నిర్వి శేషముగా భావించినను జీవితములో ముఖ్యముగా అంత్యదశలో మిక్కిలి బాధ అనుభవించినట్లు అతను రాసిన రెండు చాటు పద్యాల వలన తెలుస్తుంది.

కవిగారు శిష్య చంచారమునకు వెళ్ళి తిరిగి వచ్చుచుండగా మార్గంలో వీరిని దొంగలు అడ్డగించి సంపాదించుకున్న వస్తువులను దోచుకొని పోయినారు. అప్పుడు అతను చెప్పిన పద్యములో అతను ఇందుర్తిసీమ చామలపల్లి నల్లగిండ తాలూకా వాసియని తెలుస్తున్నది. అతను చోరులపహరించిన వస్తువులను పద్యములో తెల్పి వారిని శపించినాడట. కవిగారు తాలాంక నందినీ పరిణయమును రాసి తాటాకులను నొక స్థలమందు ఉంచగా వాటిని పాడి బర్రె వచ్చి కొంత భంక్షించినదటా. దానికి వగచి మహిషిని శపించు చాటు పద్యం కూడా కలదు.

రచనా కాలంసవరించు

ఈ తాళ పత్ర గంథాల రచనా కాలమునకు సంబంధించిన వివరాలు పద్యములలో కలవు. దీని ప్రకారం శాలివాహన సంవత్సరము సరియకు క్రీ.శ 1872 అగును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందు గల తాటాకు పుస్తకము 3 అశ్వాసము చివర "ఈశ్వర నామ సంవత్సర నిజ జ్యేష్ట బహుళ పాడ్యమీ భౌమవాసరం సాయంకాలం వరకు తాలాంక నందినీ పరిణయం తృతీయాశ్వాసము. శ్రీరామానీ వేకలపూ, శ్రీ హయగ్రీవాయ నమః శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శ్రీంజేయును" అని కలదు. దీని ప్రకారం ఈ పుస్తక రచనా కాలం 26.6.1877 అని తెలియు చున్నది. [1]

పుస్తక విశేషాలుసవరించు

ఒకప్పుడు లభ్యమై ఇప్పుడు దొరకని కావ్యాలను ప్రచురించడమే థ్యేయంగా పనిచేసే సాహిత్య అకాడమీ "తాలంక నందినీ పరిణయం" పుస్తకాన్ని ముద్రించింది.

అసూరిమరింగంటి వేంకట నరసింహాచార్యుల "తాలాంకనందినీ పరిణయము" ఈ పుస్తక ప్రచురణకు ముందు దాదాపు వంద సంవత్సరాలకు పూర్వమే రచించప బడినప్పటికీ తొలిసారిగా ఇప్పుడు తొలిసారిగా ముద్రణకు అందుకున్నది. మరిగంటి వంశం వారు సంస్కృత ఆంధ్ర భాషలలో అశేష పాండిత్యమును సంపాదించి అనేక సాహితీ ప్రక్రియా రచనల్లో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి సాహిత్యాన్ని, భక్తి తత్వాన్ని తెలుగులో ప్రచారం చేసినవారు.

ఈ పుస్తకం రసవత్తరమైనది. అందమైన పదబంధాలతోనూ, చమత్కార జనకమైన శబ్ద, అర్థ అలంకారతోనూ, చిత్రబంధ కవిత్వాలతోనూ, చక్కని జాతీయాలతోణూ, మాండలిక ప్రయోగాలతోనూ, కూడి ఉంటుంది. ఈ భూమిపై రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకూ ఈ కావ్యం ఉంటుందని కవి చెప్పుకున్నాడు. దొరికినన్ని ప్రతులను పరిశీలించి ఈ కావ్యాన్ని పరిష్కరించి, చక్కని పీఠిక సమకూర్చి శ్రీ రంగాచార్యులు అకాడమీ తరపున ప్రచురించారు.

మూలాలుసవరించు

  1. ఆసూరి మఱింగంటి వేంకట నరసింహాచార్య, శ్రీరంగాచార్య(సం ) (1980). తాలాంక నందినీ పరిణయము.

బాహ్య లంకెలుసవరించు