తాష్కెంట్ ప్రకటన

భారత దేశము మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన శాంతి ఒప్పందం

తాష్కెంట్ ప్రకటన (తాష్కెంట్ డిక్లరేషన్, అంగ్లమ్:Tashkent Declaration) అనేది భారత దేశము, పాకిస్తాన్ మధ్య 1966 జనవరి 10 న జరిగిన శాంతి ఒప్పందం. తాష్కెంట్ ప్రకటన భారత్ పాకిస్తాన్‌ యుద్ధాన్ని పరిష్కరించింది.

రెండు దేశాల మధ్య ఏప్రిల్ 1965 నుండి సెప్టెంబరు 1965 వరకు చిన్న తరహా, క్రమరహితమైన పోరాటమ్ 1965 లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధనికి దారితీసింది. ఇది జమ్మూ, కాశ్మీర్ రాచరిక రాష్ట్రాల యొక్క వనరులు, జనాభాపై నియంత్రణను కోసం జరిగింది.

అవలోకనంసవరించు

Uzbek SSR, యు ఎస్ ఎస్ ఆర్ (USSR) (ఇప్పుడు ఉజ్బెకిస్తాన్) లో తాష్కెంట్లో 4-10 జనవరి 1966 నుండి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక సమావేశం జరిగింది.

సోవియట్ప్ర తరుపున అలెక్సీ కొసిగిన్, భారత ప్రధానమంత్రి లాల్ లాల్ బహాదుర్ శాస్త్రి, పాకిస్తాన్ అధ్యక్షుడు ముహమ్మద్ అయుబ్ ఖాన్లకు మద్యవర్తి అయ్యరు.

యునైటెడ్ నేషన్స్, అమెరికన్, సోవియట్ ప్రమేయం వల్ల తాష్కెంట్ సమావేశంలో, భారత దేశము, పాకిస్తాన్ ఒప్పంద బాధ్యతలచే కట్టుబడి, ఒకరితో ఒకరినొకరు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను విడిచిపెట్టి, కాశ్మీర్లో 1949 కాల్పుల విరమణ రేఖకు తిరిగి రావడానికి అంగీకరించాయి.

ప్రకటనసవరించు

ఈ సదస్సు గొప్ప విజయాన్ని సాధించింది, విడుదలైన ప్రకటన శాశ్వత శాంతి కోసం ఒక ప్రణాళికగా భావించబడింది.భారత్, పాకిస్థాన్ బలగాలు వారి పూర్వ-సంఘర్షణల స్థానాలకు చేరుకున్నయి.రెండు దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోడదు, ఆర్థిక, దౌత్య సంబంధాలు పునరుద్ధరించబడాలి, యుద్ధ ఖైదీల క్రమబద్ధమైన బదిలీ చెయాలి, ఇరు డేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలి.

పర్యవసానాలుసవరించు

ఈ ఒప్పందానికి భారతదేశంలో విమర్శలు వచ్చాయి, ఎందుకంటే ఇది కాశ్మీర్లో గెరిల్లా యుద్ధానికి విరుద్దంగ ఏ విధమైన ఒప్పందం కలిగి లేదు.ఒప్పందంపై సంతకం చేసిన తరువాత, భారత ప్రధాన మంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి తాష్కెంట్లో అనుమానస్పదంగా మరణించారు.శాస్ర్తి గారి యొక్క ఆకస్మిక మరణానికి కరణం విషప్రయొగం అని కుట్రపూరిత సిద్ధాంతానికి దారితీసింది.భారత ప్రభుత్వం ఆయన మరణం గురించి నివేదికను ప్రకటించటానికి నిరాకరించింది, ఎందుకంటె ఇది విదేశీ సంబంధాలకు నష్టాన్ని కలిగించవచ్చని, దేశంలో విఘాతం కలిగించి పార్లమెంటరీ అధికారాలను పోగోట్టుకొవచ్చని బవించింది.

తాష్కెంట్ ప్రకటనకు అనుగుణంగా, మంత్రివర్గ స్థాయిలో చర్చలు మార్చి 1, 1966 మార్చి 2 న జరిగాయి. ఈ చర్చలు ఫలవంతం కానప్పటికీ, వసంత ఋతువు, వేసవి అంతటా కొనసాగాయి.కాశ్మీర్ సమస్యపై అభిప్రాయ భేదం ఉన్నందున, ఈ చర్చల్లో ఏ ఫలితమూ సాధించలేదు.