తిప్పతీగె కుటుంబము

తిప్పతీగె కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.[1]

తిప్పతీగ

ఈ కుటుంబములో నున్న మొక్కలు తిరుగుడి తీగలె. ఆకులు ఒంటరి చేరిక, వానికి గణుపు పుచ్చములుండవు. పువ్వులు మెండుగా నుండును. అవి యేకలింగ పుష్పములు. అండాశయము క్రింద గొంచము కలిసి యుండును గాని పైన విడిగానె యుండును.

తిప్పతీగె పలు తావులందు బెరుగు చున్నది. వేరు పెద్దదిగాను మెత్తగాను వుండును.

కుటుంబ లక్షణాలు

మార్చు
  • ప్రకాండము: తిరిగెడు తీగ (నులితీగలు లేవు) పెద్ద చెట్లమీద ప్రాకును. దశసరి బెరుడు ఉంది. కొమ్మలనుండి సన్నని వ్రేళ్ళు మర్రి యూడలవలె గ్రిందకు దిగును.
  • ఆకులు: ఒంటరి చేరిక. హృదయాకారము లఘు పత్రములు, సమాచలము, రెండు ప్రక్కల నున్నగానుండును. తొడిమ మొదట కొంచెము లావుగ నున్నది.
  • పుష్పమంజరి: కొమ్మలు చివర నుండి గాని, కణుపు సందులనుంఛి గాని, గెలలు, కొన్ని కణుపు సందులందు విడివిడిగా కూడా గలవు. ఏక లింగ పుష్పము.
  • పురుష పుష్పములు:
  • పుష్పకోశము: అసంయుక్తము, రక్షక పత్రములు 6. నీచము.
  • దళవలయము: అసంయుక్తము. 6 రక్షక పత్రములలో సగము పొడుగుండును.
  • కింజల్కములు: 6. గద వలే నుండును. ఆకర్షణ పత్రముల కంటే పొడుగు. పుప్పొడి తిత్తులు రెండు. కాడల చివర నున్న కండలో దిగి యున్నవి.
  • స్త్రీ పుష్పములు: పుష్ప కోశమును దళ వలయమును పురుష పుష్పము నందువలెనే యుండును.
  • కింజల్కములు: కాడలు ఆరు. పుప్పిడి తిత్తులు లేవు.
  • అండకోశము: అండాశయము ఉచ్చము. విభక్తాండాసయము. 3. కీలము ఒకటి. కీలాగ్రము చీలి యున్నది. సాధారణముగ నీ మూడు నెదుగవు. అండ మొక్కొక్క దానిలో నొక్కొక్కటి కండ కాయ., జీడి గింజ (ఫలము) ఆకారముగ నుండును.

ముఖ్యమైన మొక్కలు

మార్చు
  • తిప్పతీగె: ఔషధములలో వాడుదురు. కొమ్మలు, వ్రేళ్ళ నుంచి తీసిన కషాయము కొన్ని జ్వరములకు బనిచేయును. పచ్చి కొమ్మలను వేళ్ళను నలుగ గొట్టి రసము తీసి యా రసము కాచిన అడుగున నొక పదార్థము మిగులును. దీనిని నిలువ చేసి ఔషధములో వాడుదురు. కొందరు మహమ్మదీయులకు వేప చెట్లల మీద ప్రాకిన తీగ మంచిదని నమ్మకము ఉంది.
  • దూసర తీగె: డొంకల మీద పెరుగును. ఇది తిప్పతీగ కంటే సన్నముగా నుండును. ఆకులు, అండాకారము. మూడు పెద్ద ఈనెలు గలవు. దీని పండ్ల రసము సిరావలె ఉపయోగించును. వేళ్ళ కషాయము పిప్పళ్ళ రసము తోడను మేక పాల తోడను కలిపి సుఖ వ్వాధుల వలన గలిగిన కీళ్ల నొప్పులు మొదలగు రోగముల కిత్తురు. ఆకులను నీళ్ళలో వేసి రాసిన యెడల నీళ్ళు ఆకు పచ్చనగును. చిక్కగాను నగును. దానిలో పంచదార వేసి సంకటము వారల కిత్తురు. ఆకులతో గూర చేసి తిన్నచో వారికి మంచిదె.
  • మానుపసుపు: పెద్ద తీగె. దీని యాకులు హృదయాకారము దానిమీద 5...7 ఈనెలుండును. కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగ జేసి నీళ్ళలో వేసి నానవేసి నానిని దిని నీరు త్రాగుచో గడుపు నొప్పియు కొన్ని జ్వరములును తగ్గును. ఈ గీతె గట్టిగా నుండుటచే నొక్కొక్కప్పుడు త్రాడు బదులు దీనినే ఉపయోగించు చుందురు.
  • తీగముషిణి: తీగె పెద్దది. పువ్వులు చిన్నవి. పచ్చాగా నుండును. పక్షులు దీని పండ్లను తినును. దీని వేరు నుండి రసము తీసి పాము కాటున కిత్తురు గాని అంతగా పని చేయునట్లు తోచదు.
  • కాకిమఱ్ఱితీగ: ఆకులు పెద్దవి. దీని కాయలను దినరాదు. అవి విషము గింజల నుండి చమురు తీసి కొబ్బరి నూనెలో గలిపి వ్రాసిన తామర మొదలగు చర్మ వ్వాధులు తగ్గును. దీని పండ్లను, గింజలను అన్నముతో కలిపి కాకులను జంపుటకు బెట్టుదురు.

మూలాలు

మార్చు
  1. వేమూరి, శ్రీనివాసరావు (1916). వృక్షశాస్త్రము. మద్రాసు: విజ్ఞాన చంద్రికా మండలి. p. 68. Retrieved 28 June 2016.