తిరుక్కడిగై ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇవి దక్షిణాదిన ప్రసిద్ధిచెందిన 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దీనిని చోళసింహపురము అని, చోళంగిపురము అని కూడా పిలుస్తారు. ఇది తిరుత్తణి నుండి 30 కి.మీ. దూరములో ఉంది.

తిరుక్కడిగై
తిరుక్కడిగై is located in Tamil Nadu
తిరుక్కడిగై
తిరుక్కడిగై
భౌగోళికాంశాలు :13°04′N 79°15′E / 13.07°N 79.25°E / 13.07; 79.25
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:వెల్లూరు
ప్రదేశం:తమిళనాడు, భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:భక్తవత్సల పెరుమాల్
ప్రధాన దేవత:అమృతవల్లి
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:తిరుక్కావేరి
విమానం:సింహకోష్ట విమానము
కవులు:పేయాళ్వార్
ప్రత్యక్షం:ఆంజనేయస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు మార్చు

ఇది చోళ సింహపురమునకు 3 కి.మీ. దూరములో కొండపాలెము ఉంది. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లి తాయార్ల సన్నిధి ఉంది. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయ స్వామివారు చతుర్భుజములతో శంఖచక్రములతో యోగముద్రలో వేంచేసి యుండుట విశేషము. ఈ క్షేత్రము విశేష ప్రార్థనా స్థలము. దీర్ఘవ్యాధులు కలవారు, గ్రహ పీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక ఆదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలమైన ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే ఉంది. ఈ క్షేత్రమునకు పడ శ్రీరంగమనియు ఇక్కడి పుష్కరిణికి తిరుక్కావేరి అని తిరునామముంచిరి.

సాహిత్యంలో తిరుక్కడిగై మార్చు

శ్లోకము :

చోళ సింహపురే యోగ సింహనామా విరాజతే |
అమృతాహ్వయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగః ||
దేవీమమృత వల్ల్యాఖ్యా మాశ్రిత ప్రాజ్ముఖాసనః |
ప్రత్యక్షో మారుతై శార్జ్గ నందకాంశ మునిస్తుతః ||

పాశురము :

మిక్కానై మఱైయాయ్ విరిన్ద విళక్కై ; ఎన్నుళ్
పుక్కానై ప్పుగ శేర్ పొలిగిన్ఱ పొన్ మలై యై ;
తక్కానై క్కడిగై త్తడజ్ణ్కన్ఱిన్ మిశైయిరున్ద ;
అక్కారక్కనియై ; అడై న్దుయ్‌న్దు పోనేనే. - తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొల్ 8-9-4.

ఉత్తరదేశ తిరుపతులు మార్చు

శ్లో. ఇదానీ ముత్తరే దేశే స్థితా దేశా: రమాపతే:|
   పర్ణ్యంతే యతిరాజాంఘ్రి ప్రభావాత్సన్ముదే మయా||

శ్రీభగవత్ రామానుజుల వారి శ్రీపాద ప్రభావముచే ఇకపై ఉత్తరదేశమున గల దివ్యదేశములను వర్ణింతును.

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
యోగ నరసింహ స్వామి (అక్కారక్కన్) అమృతవల్లి త్తాయార్ అమృత తీర్థము తూర్పుముఖము కూర్చున్న భంగిమ కలియన్; పేయాళ్వార్ సింహకోష్ట విమానము ఆంజనేయస్వామికి

మంచిమాట మార్చు

బ్రహ్మవిద్యలు మార్చు

సంసార సాగరమునబడి దరిచేరలేక దు:ఖించుట జూచి సర్వేశ్వరుడు కృపతో ఉద్దరించాలని వేదం అనుగ్రహించాడు. వేద ఉత్తర భాగమున అధికారానుగుణ్యముగా బ్రహ్మ విద్యాత్మకములైన ఉపాసనములు తెలుపబడినవి. ఇవి ముప్పది రెండు. ఈ ముప్పది రెండు ఉపాసనములు వ్యాస మహర్షిచే బ్రహ్మసూత్రము లందు పేర్కొనబడినవి.

  • ఈశావాస్య విద్య
  • సద్విద్య
  • ఆనందమయవిద్య
  • అంతరాదిత్యవిద్య
  • ఆకాశవిద్య
  • ప్రాణ విద్య
  • పరంజ్యోతి విద్య
  • ప్రతర్దన విద్య
  • శాండిల్య విద్య
  • నాచికేత విద్య
  • ఉపకోసల విద్య
  • ఉద్దాలకాంతర్యామి విద్య
  • అక్షరసర విద్య
  • వైశ్వానర విద్య
  • భూమ విద్య
  • గార్గ్యక్షర విద్య
  • సత్యకామ విద్య
  • దహర విద్య
  • అంగుష్ఠ ప్రమిత విద్య
  • మధు విద్య
  • సంపర్గ విద్య
  • అజా విద్య
  • జ్యోతిషాంజ్యోతిర్విద్య
  • బాలాకి విద్య
  • మైత్రేయీ విద్య
  • రుద్ర విద్య
  • చతుర్ముక విద్య
  • పంచాగ్ని విద్య
  • ఆదిత్య మండలస్థ సత్యబ్రహ్మ విద్య
  • అక్షిస్థ సత్య బ్రహ్మ విద్య
  • పురుష విద్య
  • ఉసస్తికహాళ విద్య

ఇవియును గాక ఇంకా కొన్ని కామవిద్యలు కూడా నిందు ప్రస్తావించబడినవి.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు