తిరునాగై
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరునాగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరునాగై | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సొందర్య రాజ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | సౌందర్యవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | సార పుష్కరిణి |
విమానం: | సౌందర్య విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్లు |
ప్రత్యక్షం: | నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు |
విశేషాలు
మార్చునాగరాజునకు ప్రత్యక్షమైన స్థలం కనుక నాగపట్నం అని పేరు వచ్చింది. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్దోత్సవము నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి" యను క్షేత్రము ఉంది.
సాహిత్యం
మార్చుశ్లోకము :
శ్లో. సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్|
సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత సౌందర్య నామ వరమన్దిర మధ్యవాస:|
సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజ: శ్రీ మత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తి:|
ప్రాచీముఖ:కలిజిదాహ్వయ సూరి కీర్త్య:భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేసౌ||
పాశురాలు
మార్చుపా. పొన్నివర్ మేని మరదకత్తిన్ పొజ్గిళంజోది యకలత్తారమ్
మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్ వేదియర్ వానవరావర్ తోழி
ఎన్నైయుం నోక్కి యెన్నల్గులమ్ నొక్కి యేన్దిళజ్గోజ్గెయుం నోక్కుకిన్నార్
అన్నైయెన్కోక్కుమొన్ఱఇజగిన్ఱేన్ అచ్చోవొరు వరழగియవా
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
సౌందర్య రాజపెరుమాల్ | సౌందర్యవల్లి తాయార్ | సౌర విమానం | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | సౌందర్య విమానము | నాగరాజుకు, తిరుమంగై ఆళ్వారుకు |
చేరే మార్గం
మార్చునాగపట్నం ప్రసిద్ధి చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.