తిరుపుళ్ళింగుడి

తిరుపుళ్ళింగుడి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుపుళ్ళింగుడి
తిరుపుళ్ళింగుడి is located in Tamil Nadu
తిరుపుళ్ళింగుడి
తిరుపుళ్ళింగుడి
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కాయశిన వేందన్
ప్రధాన దేవత:మలర్‌మకళ్ తాయార్(పుళిజ్గుడి వల్లి)
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:వరుణ తీర్థము, నిర్‌ఋతి తీర్థము
విమానం:వేదసార విమానము
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:వరుణ నిర్‌ఋతులకు

విశేషాలు

మార్చు

నమ్మాళ్వార్ "వణ్డనాళాల్" తిరువాయిమొళిలో (9-2-4) "పుళింగుడి కిడందు" (తిరుప్పుళింగుడిలో వెలసి ఉండి) యని సర్వేశ్వరుని "భోగ్యపాక త్వర" అను గుణమును ప్రస్తుతించారు. ఈక్షేత్రమునకు "తెళింద చింతైక్కు మున్నిల్ మూన్ఱు" (నిర్మలమైన హృదయములో ప్రకాశించిన స్వామిగల దివ్యదేశములు మూడు 9-2-4) అను విలక్షణ నామము ఉంది. మిగిలిన రెండు క్షేత్రములు వరగుణమంగై, శ్రీవైకుంఠము. ఇది ఇంద్రునకు బ్రహ్మహత్యాదోషము పోగొట్టిన స్థలము

తిరుప్పుళ్ళింగుడి గుడిలో స్వామి శయనించియున్నాడు. శ్రీవైకుంఠములో నిలచియున్నాడు. ఆళ్వార్లు స్వామిని "స్వామీ! ఒక్కమారైనను సుఖాసీనుడవై దర్శనమును అనుగ్రహింపుము. సంసారులందరు నీపాదములపై బడి నిన్ను స్తోత్రము చేస్తారు. ఆ కమనీయ దృశ్యమును సేవింప నాశగానున్నది" యని ప్రార్థించిరని. ఇచట నొక ఐతిహ్యము ఉంది.

ఒకనాడు పెరుమాళ్ల సన్నిధిలో శ్రీవైష్ణవులు ఒక వైపున గొల్లవాండ్రు ఒకవైపున నిలచి పెరుమాళ్లను సేవించుచుండగా "వంగి పురత్తునంబి" అనువారు శ్రీవైష్ణవ గోష్ఠిని వీడి గొల్లల పంక్తిని చేఋఆడూ. దీనిని చూచిన "ముదలి యాండాన్" "ఇలా ఎందుకు చేసావు?" అని అడుగగా ఎట్లైనను మనకు అభిమానము, అభిజినాహంకారము ఉంటుంది. గొల్లవాండ్ర కవి లేవు. కావున పెరుమాళ్ల దృష్టి వారితోపాటు నామీద కూడ పడుతుందని నిలచాను. సర్వేశ్వరుని దృష్టి మనమీద పడుట నీరు మెరకకు ప్రవహించుట వలె కష్టము. వీరిపై పడుట నీరు పల్లమునకు ప్రవహించుట వలె సుకరము కదా!" యని అన్నాడు.

సాహిత్యం

మార్చు

శ్లో. శ్రీమత్కాశిన వేందవాహ్వయ విభు స్తీర్థాంచితే నిర్‌ఋతే:
   ప్రాచీ వక్త్రయుత: పుళిజ్గుడి పురే భోగీంద్ర భోగశయ:|
   నాయక్యా తు మలర్ మకళ్ పదయుజా శ్రీ వేద సారంగతో
   వమాసం వరుణాశరాతిధి వపూ రేజే శఠారి స్తుత:||

పాశురాలు

మార్చు

పా. పణ్డైనాళాలే నిన్ఱిరు వరుళుమ్; పజ్గయత్తాళ్ తిరువరుళుమ్‌
    కొణ్డు; నిన్ కోయిల్‌శీయ్‌త్తు ప్పల్ పడికాల్;కుడి కుడి వழி వన్దాట్బెయ్యుమ్‌
    తొణ్డరోర్‌క్కరుళి చ్చోతివాయ్ తిఱన్దున్; తామరై క్కణ్గళాల్ నోక్కాయ్;
    తెణ్డిరై ప్పొరునల్ తణ్ పణై శూழ்న్ద; తిరుప్పుళిజ్కుడిక్కిడన్దానే.
                నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-1

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కాయశిన వేందన్ మలర్‌మకళ్ తాయార్(పుళిజ్గుడి వల్లి) వరుణ తీర్థము, నిర్‌ఋతి తీర్థము తూర్పు ముఖము భుజజ్గ శయనము నమ్మాళ్వార్ వేదసార విమానము వరుణ నిర్‌ఋతులకు

చేరే మార్గం

మార్చు

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు