తిరుప్పులియూర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుప్పులియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరుప్పులియూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మాయప్పిరాన్ |
ప్రధాన దేవత: | పొఱ్కొడినాయకి |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | పూంశునై తీర్థము |
విమానం: | పురుషోత్తమ విమానము |
కవులు: | నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | సప్తర్షులకు |
విశేషాలు
మార్చుఈ క్షేత్రము భీమ సేనుడు ప్రతిష్ఠించాడని భావిస్తున్నారు. పెరుమాళ్ల ముఖమండలము రజిత కవచముచే కప్పబడి ఉంటుంది. నమ్మాళ్వార్లు తిరువాయిమొళిలో తోళిమార్(సఖి) దశలో చెప్పిన దశకములు మూడు. అందులో "కరుమాణిక్కమలై మేల్" (8-9) అను దశకము మూడవది. ఈ మూడు దశకములలోని ప్రణవ మందలి ఉకారార్థమగు అనన్యా ర్హత్వము ప్రకటింపబడినది. ఇందు మొదటి పాశురమున "కరుమాణిక్కమలైమేల్ మణిత్తడన్దామరైక్కాడుగల్పోల్; తిరుమార్వువాయ్ కణ్‌కై ఉన్దికాల్ ఉడై ఆడైగళ్".
తిరుప్పులియూర్‌లో వేంచేసియున్న స్వామి తిరుమేని నీల రత్నగిరివలె నున్నది. స్వామి వక్షస్థలము; మోని; నేత్రములు, శ్రీహస్తములు; నాభి, శ్రీపాదములు; పీతాంబరము మున్నగునవి ఆకొండమీది సరోవరమునగల పద్మవనము వలెనున్నవి" యని ఉత్తమ నాయక లక్షణములను కీర్తించారు.
సాహిత్యం
మార్చుశ్లో. పులియూరితి విశ్రుతే స్థితో నగరే పూంశున తీర్థ సుందరే
పురుషోత్తమ దేవయానగ శ్శుశుభే పొఱ్కొడి నాయకీపతి:||
శ్లో. మాయప్పిరాన్ నామ హరి:సప్తర్షి నయనాతిథి:
ప్రాజ్ముఖ శ్శఠజి త్పూక్తి శతకే కీర్తితోసమే||
చేరే మార్గం
మార్చుశజ్గణూర్కు 5 కి.మీ. వసతులు స్వల్పము.