తిరుమంగై ఆళ్వార్

తిరుమంగై అల్వార్ ను తిరుమంగై మన్నన్ అని కూడా పిలుస్తారు[2]. దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు. అతను హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా గుర్తింపు పొందాడు. అతను పద్యాల కూర్పులో అత్యంత ఉన్నతమైన అళ్వార్లలో ఒకనిగా పరిగణించబడ్డాడు[3]. అతనికి అద్భుతమైన కవితా "నర్కవి పెరుమాళ్" అనే బిరుదు ఉంది.[3] అతనికి పరకాలయోగి అని కూడా పిలుస్తారు.

తిరుమంగై ఆళ్వార్
తన భార్య కుముదవల్లి (కుడి వైపు ఆమె కిరీటం మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన చిత్రం హారాలతో మూసివేయబడినది) తో తిరుమంగై ఆళ్వార్ (ఎడమ)
జననంకాలియన్
8వ శతాబ్దం (traditional dating: 2702 BCE)[1]
కురియాలూర్ (తిరువలి-తిరునగరి)
నిర్యాణముతిరుక్కురుగుడి (తిరునెల్వేలి జిల్లా)
బిరుదులు/గౌరవాలుఆళ్వారులు
తత్వంవైష్ణవం, భక్తి
సాహిత్య రచనలుపెరియ తిరుమోలి, తిరునెదుంతండకం, తిరుకురుతండకం, తిరువెలుఖ్ఖుతిరుక్కై, సిరియతిరుమదల్, పెరియా తిరుమదల్

జీవిత విశేషాలు

మార్చు

అతను కలియుగ ప్రారంభంలో 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక (కార్తిక) మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందు జన్మించాడు. అతనికి తన తండ్రి ""నీలనిఱైత్తర్" అని నామకరణం చేసాడు.

అతను పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొన్నాడు. అందుకు అతను శ్రీవైష్ణవ ఆరాధనను నిర్వహించుచూ పూజా ద్రవ్యములకై దొంగతనము చేసేవాడు. అతనిని పరీక్షింపదలచి పెండ్లి కుమారుని వేషములో వచ్చిన శ్రీమహావిష్ణువుని కూడా దోచి స్వామి పాదస్పర్శచే జ్ఞానోదయము పొందెను. అతను "నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి.

అతను తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారము చేయుచు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుచుండిరి. వేదబాహ్యులైన జైన బౌద్ధాదులను జయించి ఆ ద్రవ్యముతో శ్రీరంగనాథులకు మణి మంటప ప్రాకారాదులు నిర్మించిరి.

వీరు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన చతుర్వేద సారభూతమైన నాల్గు ప్రబంధములకు షడంగములుగా ఆరుప్రబంధములను అనుగ్రహించిరి. వీరివైభవము వాచామగోచారము. దానిని గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.[4]

మూలాలు

మార్చు
  1. Sakkottai Krishnaswami Aiyangar (1911). Ancient India: Collected Essays on the Literary and Political History of Southern India. pp. 403–404, 409. ISBN 9788120618503.
  2. VK 2006, p.49
  3. 3.0 3.1 Pillai 1994, pp. 192–4
  4. "దివ్యదేశ వైభవ ప్రకాశికా/ఆళ్వారుల వైభవం - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-05.

వనరులు

మార్చు