తిరుమళిశై ఆళ్వార్

తిరుమళిశై ఆళ్వార్ శ్రీవైష్ణవ శాఖకు చెందిన తమిళ విష్ణు భక్తుడు, పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరు. తొండనాడు(ప్రస్తుతం కంచిపురం, తిరువళ్ళూర్ జిల్లాల్లో భాగం)కు చెందినవారు. క్రీ.పూ.4203లో జన్మించినట్టు భావిస్తారు.[1][2] శ్రీవైష్ణవ సంప్రదాయం ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చక్రాయుధం, సుదర్శనం అవతారంగా భావిస్తారు. తిరుమళైశాయిలోని జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో భగవత్ కృపచే జన్మించారని నమ్ముతారు.

తిరువాలన్, పంకయా చెల్వి అన్న పిల్లలు లేని, గిరిజన దంపతులు కట్టెలు కొడుతుండగా బాలుడిని చూసి, ఇంటికి తెచ్చుకున్నారు. దంపతులకు కనికణ్ణన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతను తిరుమళిశై ఆళ్వారు శిష్యుడు అయ్యారు.

తిరుమళైశాయి ఆళ్వార్ తాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య & శూద్ర వర్ణాలకు చెందినవాణ్ణి కానని చెప్పుకున్నారు, ఒకానొక ద్విపదల్లో తనను తాను అవర్ణుడిగా అంటే కులం లేనివానిగా లేదా దళితునిగా పేర్కొన్నారు.

తొలినాళ్ళ జీవితం

మార్చు

ఆయన పేరు తిరుమళైశాయి అన్న ఆయన పుట్టిన ప్రదేశం పేరుమీదుగా వచ్చింది, ప్రస్తుతం ఇది నేటి చెన్నై నగరంలో అంతర్భాగంగా ఉంది.[3] భార్గవ మహర్షి, కనకాంగి దంపతులకు, తల్లి గర్భంలో అసహజమైన 12 నెలల గర్భవాసం అనంతరం జన్మించారు.  కాలుసేతులు, ప్రాణం లేని శరీరంగా శిశువు బయటకు వచ్చాడు. దంపతులు తీవ్రంగా నిరాశ చెంది, అయిష్టంగానే ఓ వెదురుపొద కింద  వదిలేసి, ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై ఆ మృతశిశువుకు మాంసం, ప్రాణం ఇచ్చి ప్రాణమున్న మనిషిని చేశారు.

అతనికి చేతులు, కాళ్ళు కూడా ఏర్పడ్డాయి, ఆప్యాయంగా ఓ గిరిజనుడైన తిరువళన్ తీసుకుని పెంచుకోవడం ప్రారంభించారు. పుణ్య దంపతులైన తిరువళన్, పంకజవల్లి ఆ బిడ్డను తమకు ప్రసాదించిన భగవంతుని కృపకు పట్టరాని సంతోషం పొందారు. పిల్లాడు పెరిగి తిరుమళిశై ఆళ్వార్ అయ్యారు. అతని కుడి పాదంలో కన్ను కూడా ఉంటుంది. తిరుమళిశై గ్రామానికి దగ్గరిలోని పిరయంపదు అన్న చిన్న పల్లెలో పదేళ్ళ వయసు వచ్చేవరకూ జీవించారు. ఈ ఆళ్వారు సుదర్శన చక్రం యొక్క అవతారంగా భావిస్తారు.

తిరుమళిశై ఆళ్వార్ అన్ని మతాల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుని. పలు మతాల సాహిత్యం చదువుకున్నారు. ఆ క్రమంలో శివుడి పరమ భక్తుడైపోగా శివక్యారు అన్న పేరు వచ్చింది. ఒకరోజు, ఓ ముసలాయన మొక్కను పీకి, తిప్పి, పగిలిపోయిన కుండతో, తెగిన తాడుతో, నీళ్ళులేని నూతిలోంచి తోడుతూ నీళ్ళపోసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మూర్ఖపు పని ఎందుకు చేస్తున్నావని శివాక్యర్ అడిగారు. ఆ పెద్దాయన మరెవరో కాదు - పెయ్ ఆళ్వార్. సజలమైన నిండు నుయ్యిలాంటి వేదాలు, స్మృతులు శ్రీమన్నారాయణుడు సర్వోన్నతుడైన దైవమని చెప్తూండగా, తెలిసి తెలిసీ శివాక్యర్ శైవాన్ని అవలంబించడం కన్నా తాను చేస్తున్నదేమీ అంతకన్నా మూర్ఖపు పని కాదని బదులిచ్చారు. ఆపైన వారిద్దరి మధ్య జరిగిన వాదనలో పెయ్ ఆళ్వార్ గెలిచి శివక్యారును వైష్ణవునిగా మార్చారు.

  1. L. Annapoorna (2000). Music and temples, a ritualistic approach. p. 23. ISBN 9788175740907.
  2. Sakkottai Krishnaswami Aiyangar (1911). Ancient India: Collected Essays on the Literary and Political History of Southern India. pp. 403–404. ISBN 9788120618503.
  3. Ramakrishna Mission (1998). "Bulletin of the Ramakrishna Mission Institute of Culture". 49. The Institute: 535–538. {{cite journal}}: Cite journal requires |journal= (help)