తిరువాలి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువాలి
తిరునగరి, తిరువళి దేవాలయాలు
తిరువాలి is located in Tamil Nadu
తిరువాలి
తిరువాలి
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వయలాలి మణవాళన్
ప్రధాన దేవత:అమృత ఘటవల్లి తాయార్
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:అలాతని పుష్కరిణీ
విమానం:అష్టాక్షర విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:కర్జమ ప్రజాపతికి

విశేషాలు మార్చు

ఈ క్షేత్రమునకు సమీపమున తిరుమంగై ఆళ్వార్ల అవతారస్థలమైన తిరుక్కుఱైయలూర్ ఉంది. వృశ్చికమాసంలో కృత్తికా నక్షత్రమునకు ముందు పది దినములు తిరుమంగై ఆళ్వార్ల జన్మనక్షత్రము అతి వైభవముగా నిర్వహించబడుతుంది. తిరువాలి తిరునగరిలో పంగుని (మీనమాసం) ఉత్తరా నక్షత్రము చివరిరోజుగా బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవములలో ఎనిమిదవ ఉత్సవమునాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ "ఆడల్ మా" అను అశ్వము మీద అవరోహించి పెరుమాళ్ ఆభరణములు అపహరించు సమయమున జరుగు సంవాదము అతి మనోహరముగా నుండును. తిరువాలి తిరునగరి వాస్తవముగా రెండు తిరుపతులు తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కి.మీ దూరములో నున్నది. తిరువాలి యందు నరసింహస్వామి సన్నిధి ఉంది. తిరునగరి యందు వయలాలి మణవాళన్ వేంచేసి యున్నారు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ దూరములో తిరునాంగూరు దివ్యదేశము ఉంది. రామానుజ కూటము ఉంది. ఈ క్షేత్రమున వేంచేసియున్న తిరుమంగై ఆళ్వార్ల సౌందర్యము వర్ణానాతీతము. ఆ సౌందర్యమును మణవాళ మామునులు ఇట్లు అభివర్ణించిరి.

సాహిత్యం మార్చు

శ్లో. దివ్యేలాతని పద్మినీ తటగతే హ్యష్టాక్షరా గారగ:
   భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసన:|
   సంప్రాప్తోమృత కుంభ పూర్వ లతికాం శ్రీ కర్దమాలాతని
   ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభు: కీర్త్య: కలిధ్వంసిన:

పాశురాలు మార్చు

   ఐయనరుళ్ మారి శెయ్యవడియెణై కళ్ వాழிయే
   అన్దుకిలుం శీరావుమ్‌ అణైయుమరై వాழிయే
   మైయిలకు వేలణైత్త వన్మై మిక వాழிయే
   మాఱామలంజ్జలిశెయ్ మలర్‌క్కరజ్గళ్ వాழிయే
   శెయ్యకలనుడనలజ్గల్ శేర్‌మార్‌పుమ్‌ వాழிయే
   తిణ్బుయముమ్‌ పణిమలర్‌న్ద తిరుకழுత్తుమ్‌ వాழிయే
   మైయల్ శెయ్యుముక ముఱువల్ మలర్‌క్కణ్గల్ వాழிయే
   మన్నుముడి తొప్పారమ్‌ వలయముడన్ వాழிయే
   "ఉఱైకழிత్త వాళైయొత్త విழிమడన్దై మాతర్ మేల్,
   ఉరుకవైత్త మనమొழிత్తు వులకழన్దనన్బిమేల్,
   కుఱైయవైత్తుమడలెడుత్త కుఱైయాలాళితిరుమణ
   జ్గొల్లైతన్నిల్ వழிపఱిత్త కుట్రమత్‌త శైజ్గెయాన్,
   మఱైయురైత్త మనిర్దతై మాలురైక్కవవవ్ మున్నే,
   మడియోతుక్కి మనమడక్కి వాయ్ పుతైత్తు ఒన్నలార్,
   కఱైకుళిత్త వేలణైత్తు నిన్ఱనిన్ద నిలైమైయెన్,
   కణ్డై విట్ట కన్ఱిడాతు కలియవాణై యాణైయే"

మార్గము: శీర్గాళి నుండి తిరువెంగాడు పోవుబస్ మార్గములో 8 కి.మీ దూరములో ఈ క్షేత్రము ఉంది. వసతులు లేవు.

పా. తూవిరియ మలరుழிక్కి త్తుణైయోడుమ్‌ పిరియాదే
    పూవిరియ మదునగరమ్‌ పాఱివరియ శిఱువణ్డే;
    తీవిరియ మఱైవళఱ్కమ్‌ పుగழாళర్;తిరువాలి
    ఏవరివెఇలై యాను క్కెన్నిలైమై యూరాయే.

    నిలయాళా నిన్ వణబ్గ వేణ్డాయే యాగిలుమ్; ఎన్
    ములై యాళ వొరువాళున్నగలత్తాలాళాయే;
    శిలై యాళా;మరమెయ్‌ద తిఱలాళా తిరుమెయ్య
    మలై యాళా; నీయాళవళై యాళ్మాట్టోమే
            తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొழி 3-6-1;9

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వయలాలి మణవాళన్ అమృత ఘటవల్లి తాయార్ అలాతని పుష్కరిణీ పశ్చిమ ముఖము కూర్చున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ అష్టాక్షర విమానము కర్జమ ప్రజాపతికి

చేరే మార్గం మార్చు

తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కి.మీ దూరములో ఉంది. తిరువాలి యందు నరసింహస్వామి సన్నిధి ఉంది. తిరునగరిలో వయలాలి మణవాళన్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ దూరములో తిరునాగూరు దివ్యదేశము, రామానుజ కూటము ఉన్నాయి.

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తిరువాలి&oldid=3904889" నుండి వెలికితీశారు