తిరువిణ్ణగర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
తిరువిణ్ణగర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరువిణ్ణగర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ఉప్పిలియప్పన్(శ్రీనివాసర్) |
ప్రధాన దేవత: | భూమిదేవి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | ఆర్తి పుష్కరిణి(అహోరాత్ర పుష్కరిణి) |
విమానం: | విష్ణు విమానము |
కవులు: | పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి |
విశేషాలు
మార్చుఈ దివ్యదేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము ఉంది. శ్లాఘ్యమైన దివ్యదేశము. (తి.వా.మొ. 6-3-2) నల్ కురువుమ్ అను తిరువాయిమొழிలో (6-3) నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్‌వకయుం పరన్ద" అని సర్వేశ్వరుని ఆఘటిత ఘటనా సామర్ద్యమనెడి కల్యాణ గుణమును ప్రకాశింపజేసిరి. తంజావూరు జిల్లాలో ప్రసిద్దమైన క్షేత్రము. ఇచ్చట స్వామి మార్కండేయ పుత్రికను వివాహమాడిరి. ఆ సమయమున భూమిదేవి నాచ్చియార్ చిన్న వయసు గలవారగుటచే తళియలో ఉప్పువేయుట కూడా తెలియనివారైరి. అందుచే నాటి నుండి స్వామి ఉప్పులేని ప్రసాదమునే ఆరగించెడివారు. నేటికిని ఉప్పులేని ప్రసాదమునే ఆరగించు చున్నారు. ఈ క్షేత్రమునకు తులసీ వనమనియు తిరునామము ఉంది. అన్ని వసతులు గలవు. సన్నిధిలో ప్రసాదములు లభించును. .
సాహిత్యం
మార్చుశ్లో. భాతి శ్రీ తిరువణ్ణగర్ పురవరే హార్త్యబ్జినీ శోభితే
శ్రీ మద్విష్ణు విమాన సంస్థితి లసన్ శ్రీ భూమి దేవీ పతి:
శ్రీ మాను ప్పిలి యప్పనాహ్వయ యుత: పక్షీంద్ర కావేరికా
ధర్మైర్దష్ట వపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్తుత:ప్రాజ్ముఖ:|
పాశురం
మార్చు పర--డరుడమ్బాయழక్కు ప్పదిత్త పుడమ్బాయ్;
కరన్దుం తోన్ఱియుమ్ నిన్ఱుమ్ కైదవజ్గల్ శెయ్‌దుమ్; విణ్ణోర్
శిరజ్గళాల్ వణజ్గుమ్ తిరువిణ్ణగర్ చ్చేర్‌న్ద పిరాన్
వరజ్గొళ్ పాదమల్లాలిల్లై యావర్‌క్కుమ్ వన్‌శరణే.
నమ్మాళ్వార్-తి.మొ 6-3-7
వణ్డుణు నఱుమల రిణ్డై కొణ్డు-వణ్ణనమ్ వినై కెడవెన్ఱు; ఆడిమేల్
తొణ్డరు మమరరుం పణియనిన్ఱ జ్గణ్డమోడ కలిడ మళన్దవనే
ఆణ్డాయున్నైక్కాణ్బద్బో రరుళె నక్కరుళుదియేల్
వేణ్డేన్ మనై వాழక్కైయై విణ్ణగర్ మేయవనే.
తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 6-1-1
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
ఉప్పిలియప్పన్ (శ్రీనివాసర్) | భూమిదేవి తాయార్ | ఆర్తి పుష్కరిణి (అహోరాత్ర పుష్కరిణి) | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ | విష్ణు విమానము | గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి |
చేరే మార్గం
మార్చుకుంభఘోణమునుండి టౌన్ బస్ ఉంది. ఈసన్నిధి తిరునాగేశ్వరము అను ప్రసిద్ధ శివ క్షేత్రమునకు 1 కి.మీ. ఇచట నుండి తిరుచ్చేరై "నాచ్చియార్‌కోయిల్" పోయి సేవింప వచ్చును